మట్టిలో మాణిక్యం.. ఏ కోచింగ్ లేకుండా 6 ప్రభుత్వ ఉద్యోగాలు..

చదువాలన్న జిజ్ఞాస, పట్టుదల, కృషి ఉంటే ఎంతటి కఠినమైన పరీక్షలను కూడా క్రాక్ చేయొచ్చు అని నిరూపిస్తున్నారు కొందరు. ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు ప్రభుత్వ ఉద్యోగాలను కొల్లగొట్టి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

చదువాలన్న జిజ్ఞాస, పట్టుదల, కృషి ఉంటే ఎంతటి కఠినమైన పరీక్షలను కూడా క్రాక్ చేయొచ్చు అని నిరూపిస్తున్నారు కొందరు. ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు ప్రభుత్వ ఉద్యోగాలను కొల్లగొట్టి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

‘పట్టుదలతో చేస్తే సమరం.. తప్పకుండా నీదే విజయం’ అనే వ్యాఖ్యలకు ఫర్ ఫెక్ట్ సింక్ ఈ యువతి. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకున్న ఈ రోజుల్లో ఏకంగా ఏడాది కాలంలో ఆరు గవర్నమెంట్ జాబ్స్ కొల్లగొట్టింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అని ఎన్నో కలలుకంటున్న యువతీ యువకులకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది. కష్టపడితే కాదు ఇష్టపడితే ఏదైనా సాధ్యమే అని నిరూపించింది ఓ మారుమూల ప్రాంతానికి చెందిన అమ్మాయి . పైసా ఖర్చు పెట్టకుండా ఈ ఉద్యోగాలను సాధించడం గమనార్హం. తల్లిదండ్రులకు ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా మారిన ఈ సరస్వతి పుత్రిక పేరు కేతావత్ నిఖిత .  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం చిన్న బుగ్గం ప్రాంతానికి చెందిన యువతి.

మారుమూల ప్రాంతమైన బుగ్గానికి చెందిన సర్దార్ సింగ్, సంధ్య దంపతుల కుమార్తె నిఖిత. ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా ఏడాదిలో ఆరు ప్రభుత్వ కొలువులను కొల్లగొట్టి.. యూత్‌కు రోల్ మోడల్‌గా నిలిచింది నిఖిత. తండ్రి కానిస్టేబుల్ కావడంతో ఆమె విద్యాభ్యాసం వివిధ ప్రాంతాల్లో కొనసాగింది. తండ్రి పడుతున్న కష్టాన్ని గమనించి.. గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని కసితో, పట్టుదలతో చదివింది. ఒకటి కాదు ఆరు ఉద్యోగాలను సాధించింది. గురుకుల సాంఘిక సంక్షేమ డిగ్రీ లెక్చరర్, పీజీటీ, మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులు టీజీటీ సహా వివిధ పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)లో గ్రూప్ 4, జూనియర్ లెక్చరర్ స్థానాలకు ఎంపికైంది. ఈ ఉద్యోగాలన్నీ కూడా ఆగస్టు 2023 నుండి జులై 2024 మధ్య కొల్లగొట్టడం గమానార్హం.

ప్రస్తుతం నిర్మల్‌లోని సాంఘిక సంక్షేమ శాఖలో డిగ్రీ లెక్చరర్‌గా చేరినట్లు నిఖిత తండ్రి వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో పనిచేస్తున్నారు. ఆమె విద్యాభ్యాసం మంచిర్యాలలో, మెదక్ జిల్లాల్లో సాగింది. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యను అభ్యసించిన నిఖిత.. మెదక్‌లోని మోడల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివింది. డిగ్రీ చేసిన తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్)‌తో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఉన్నత చదువులు పూర్తయ్యాక ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా ప్రిపరేషన్‌కు సిద్ధమైనట్లు వెల్లడించింది నిఖిత. యూనివర్శిటీలో ప్రొఫెసర్ కావాలన్నదే ఆమె ధ్యేయమని చెబుతుంది. కాగా, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష, తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (సెట్)లో కూడా ఉత్తీర్ణత సాధించింది.

Show comments