SBIలో ఉద్యోగాలు.. పరీక్ష లేదు.. నెలకు రూ. 45 వేల జీతం

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి దేశీయ ప్రభుత్వ అతిపెద్ద బ్యాంక్ శుభవార్తను తెలిపింది. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి దేశీయ ప్రభుత్వ అతిపెద్ద బ్యాంక్ శుభవార్తను తెలిపింది. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

ప్రముఖ దేశీయ ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ శుభవార్తను తెలిపింది. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎస్బీఐ తాజాగా 94 రిసాల్వర్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం పొందే అవకాశాన్ని కల్పిస్తోంది ఎస్బీఐ. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని కోరుతోంది. మరి ఈ పోస్టులకు ఎవరు అర్హులు? వయోపరిమితి ఎంత? ఇంకా ఇతర అర్హతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎస్బీఐ రిక్రూట్‌మెంట్ 2023 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 1 నుంచి ప్రారంభమైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నవంబర్ 21, 2023లోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అయితే ఈ పోస్టులకు అభ్యర్థులందరు అర్హులు కాదు. రిటైర్డ్ బ్యాంకు అధికారులు మాత్రమే అర్హులు. రిటైర్డ్ బ్యాంకు అధికారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది ఎస్బీఐ. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ ను క్షుణ్ణంగా పరీశీలించాలని కోరింది.

ముఖ్యమైన సమాచారం

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేక అర్హత లేదు. ఎస్బీఐ రిటైర్డ్ అధికారులు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత రంగంలో మంచి అనుభవం, పని పరిజ్ఞానం, విద్యార్హత, పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

ఎంపిక

ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూ రౌండ్ కూడా ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా అన్ని అవసరమైన పత్రాలను (అసైన్‌మెంట్ వివరాలు, ID రుజువు, వయస్సు రుజువు మొదలైనవి) అప్‌లోడ్ చేయాలి, లేకుంటే వారి దరఖాస్తు/అభ్యర్థిత్వం షార్ట్‌లిస్టింగ్/ఇంటర్వ్యూ కోసం పరిగణించబడదు.

మెరిట్ జాబితా ఇలా తయారవుతుంది

ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలో అర్హత మార్కులను బ్యాంక్ నిర్ణయిస్తుంది. అభ్యర్థులు కనీస అర్హత మార్కులను పొందినట్లయితే, ఇంటర్వ్యూలో పొందిన మార్కుల అవరోహణ క్రమంలో తుది ఎంపిక కోసం మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది.

దరఖాస్తు ఫీజు

ఈ పోస్టుల ప్రత్యేకత ఏమిటంటే అభ్యర్థులు దరఖాస్తుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇతర వివరాలను తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ ఉండండి.

Show comments