iDreamPost
android-app
ios-app

IPPB: ప్రభుత్వ బ్యాంక్ లో ఉద్యోగాలు.. ఎటువంటి రాత పరీక్ష అవసరం లేదు!

  • Published Oct 16, 2024 | 2:09 PM Updated Updated Oct 16, 2024 | 2:09 PM

IPPB: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తాజాగా కొన్ని పోస్టులను రిలీజ్ చేసింది. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

IPPB: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తాజాగా కొన్ని పోస్టులను రిలీజ్ చేసింది. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

IPPB: ప్రభుత్వ బ్యాంక్ లో ఉద్యోగాలు.. ఎటువంటి రాత పరీక్ష అవసరం లేదు!

గవర్నమెంట్ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. సెంట్రల్ గవర్నమెంట్ కి చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ రిక్రూట్మెంట్ తాజాగా విడుదల అయ్యింది. మరి ఇందులో ఏ పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయి? మొత్తం ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? ఈ పోస్టులకు విద్యార్హత ఏంటి? వీటికి ఎలా అప్లై చేసుకోవాలి? ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు ఎంత? ఈ పోస్టులకు జీతం ఎంత? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఎగ్జిక్యూటివ్ లెవెల్ లో గ్రామీణ్ డాక్ సేవక్(GDS) పోస్టుల నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం ఇందులో 344 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్ధుల విద్యార్హత విషయానికి వస్తే.. భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏదైనా కాలేజీ లేదా యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసి ఉండాలి. అలాగే అభ్యర్ధికి 2 సంవత్సరాలు GDS గా పని చేసిన అనుభవం ఉండాలి. ఇక వయసు విషయానికి వస్తే.. ఈ GDS పోస్టుకు అప్లై చేసుకునే అభ్యర్ధి వయస్సు 20 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధి వయసు సెప్టెంబర్ 1 2024 నాటికి 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. అలాగే 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీకి వయస్సులో సడలింపు ఉంటుంది. గ్రాడ్యుయేషన్‌లో మీకు వచ్చిన మార్కుల శాతం ఆధారంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మాక్సిమం ఆన్‌లైన్ టెస్ట్ ఉండదు. కానీ అవసరం అయితే ఆన్లైన్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది.ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30,000/- జీతం చెల్లిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) అధికారిక వెబ్‌సైట్ https://ippbonline.com/లో అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ 31 అక్టోబర్ 2024 వరకు మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది. ఆ తేదీ లోగా అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఫారమ్‌లను చివరి రిజిస్ట్రేషన్ తేదీ కంటే ముందే సబ్మిట్ చేయాలి.

ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) వెబ్‌సైట్‌ https://ippbonline.com/ను ఓపెన్ చెయ్యండి. హోమ్ పేజీలో Careers ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అందులో మీకు Engagement of Gramin Dak Sevak from Department of Posts to IPPB as Executive అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిలో అప్లికేషన్ ప్రాసెస్, గైడ్ లైన్స్ పూర్తిగా చదవండి. తరువాత మీకు అందులో apply now ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ పేరు, పూర్తి వివరాలు ఇంకా ఇమెయిల్‌ను ఎంటర్ చేయండి. అప్పుడు మీకు సిస్టమ్ ద్వారా ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ వస్తాయి. వాటి ద్వారా లాగిన్ అయ్యి ముందుగా మీరు చదువుకున్న గైడ్ లైన్స్ ప్రకారం ఫోటో & సిగ్నేచర్ ని అప్‌లోడ్ చేయండి. తరువాత 750/- రూపాయల అప్లికేషన్ ఫీజుని చెల్లించండి. దాంతో మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. తరువాత ఈ అప్లికేషన్‌ను కచ్చితంగా డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ అవుట్ తీసుకోండి. ఇదీ ప్రాసెస్. కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్ధులు ఇప్పుడే అప్లై చేసుకోండి. ఇక ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఎగ్జిక్యూటివ్ లెవెల్ లో రిలీజ్ చేసిన ఈ గ్రామీణ్ డాక్ సేవక్(GDS) పోస్టుల నోటిఫికేషన్ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.