iDreamPost
android-app
ios-app

పవర్ గ్రిడ్ కార్పోరేషన్ లో ఉద్యోగాలు.. నెలకు రూ. 74 వేల వరకు జీతం!

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త. కేంద్ర విద్యుత్ సంస్థ అయినటువంటి పవర్ గ్రిడ్ కార్పోరేషన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 74 వేల వరకు జీతం అందుకోవచ్చు.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త. కేంద్ర విద్యుత్ సంస్థ అయినటువంటి పవర్ గ్రిడ్ కార్పోరేషన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 74 వేల వరకు జీతం అందుకోవచ్చు.

పవర్ గ్రిడ్ కార్పోరేషన్ లో ఉద్యోగాలు.. నెలకు రూ. 74 వేల వరకు జీతం!

మీరు ఉద్యోగా కోసం ఎదురు చూస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కంటున్నారా? మీ కలల్ని నిజం చేసుకునే సమయం వచ్చింది. మీలాంటి ఆశావాహులకు ఇదొక సువర్ణావకాశం. కేంద్ర విద్యుత్ సంస్థ నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. పవర్ గ్రిడ్ కార్పోరేషన్ లో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు భర్తీ ప్రక్రియను చేపట్టింది. ఈ క్రమంలోనే న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగా భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 203 జూనియర్‌ టెక్నీషియన్‌ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరి ఈ పోస్టులకు అర్హతలు, వయసు నిబంధనలు వంటి వివరాలు మీకోసం..

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశ వ్యాప్తంగా రీజినల్‌ రిక్రూట్‌మెంట్ స్కీం కింద ఎలక్ట్రీషియన్ విభాగంలో జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 203 పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి ఆన్‌ లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 12వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్ సైట్ https://www.powergrid.in/ ను సందర్శించాలని కోరింది.

ముఖ్యమైన సమాచారం :

మొత్తం పోస్టులు

  • 203 జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ ఉద్యోగాలు

విభాగం:

  • ఎలక్ట్రీషియన్

అర్హత:

  • గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు/ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రీషియన్ ట్రేడులో ఐటీఐ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 27 సంవత్సరాలు మించకూడదు.

జీతం:

  • ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,500- రూ.74,000 వరకూ ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

  • సీబీటీ టెస్ట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు:

  • రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

అప్లికేషన్ విధానం :

  • ఆన్‌లైన్‌

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 22-11-2023

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ:

  • 12-12-2023

పీజీసీఎల్ అధికారిక వెబ్‌సైట్‌ :

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి