iDreamPost
android-app
ios-app

BTech చేసి ఖాళీగా ఉన్నారా? ఈ ఇంజినీర్ జాబ్స్‌ మీకోసమే.. లక్షల్లో జీతాలు

  • Published Jun 06, 2024 | 12:00 PM Updated Updated Jun 06, 2024 | 12:00 PM

మీరు బీటెక్ గ్రాడ్యుయేట్స్ అయితే భారీ శుభవార్త. ప్రముఖ సంస్థ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే లక్షల్లో జీతాలు అందుకోవచ్చు.

మీరు బీటెక్ గ్రాడ్యుయేట్స్ అయితే భారీ శుభవార్త. ప్రముఖ సంస్థ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే లక్షల్లో జీతాలు అందుకోవచ్చు.

BTech చేసి ఖాళీగా ఉన్నారా? ఈ ఇంజినీర్ జాబ్స్‌ మీకోసమే.. లక్షల్లో జీతాలు

మీరు బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఈ ఇంజినీర్ ఉద్యోగాలు మీకోసమే. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే లక్షల్లో జీతాలు అందుకోవచ్చు. తాజాగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 247 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు పోస్టును అనుసరించి డిగ్రీ, బీఈ, బీటెక్‌, సీఏ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మెకానికల్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, కెమికల్ ఇంజినీర్, సీనియర్ ఆఫీసర్- సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్స్ అండ్‌ మెయింటెనెన్స్, సీనియర్ ఆఫీసర్- సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్స్ వంటి తదితర పోస్టులను భర్తీ చేయనున్నది. పోస్టులను అనుసరించి 25 నుంచి 45 ఏళ్లు వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. పోస్టులను అనుసరించి 50 వేల నుంచి 36లక్షల వరకు జీతం పొందొచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జూన్‌ 30 దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • మొత్తం పోస్టులు : 247

విభాగాల వారీగా ఖాళీలు:

  • మెకానికల్ ఇంజినీర్- 93
  • ఎలక్ట్రికల్ ఇంజినీర్- 43
  • ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీర్- 5
  • సివిల్ ఇంజినీర్- 10
  • కెమికల్ ఇంజినీర్- 7
  • సీనియర్ ఆఫీసర్- సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్స్ అండ్‌ మెయింటెనెన్స్- 6
  • సీనియర్ ఆఫీసర్- సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్స్- 04
  • సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్- నాన్-ఫ్యూయల్ బిజినెస్- 12
  • సీనియర్ ఆఫీసర్- నాన్-ఫ్యూయల్ బిజినెస్- 02
  • మేనేజర్- టెక్నికల్- 02
  • మేనేజర్- సేల్స్ ఆర్‌ అండ్‌ డీ ప్రొడక్ట్‌ కమర్షియలైజేషన్‌- 02
  • డిప్యూటీ జనరల్ మేనేజర్ క్యాటలిస్ట్ బిజినెస్ డెవలప్‌మెంట్- 01
  • చార్టర్డ్ అకౌంటెంట్స్- 29
  • క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్స్‌- 09
  • ఐఎస్‌ ఆఫీసర్‌- 15
  • ఐఎస్‌ సెక్యూరిటీ ఆఫీసర్- సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్- 01
  • క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్- 06

అర్హత:

  • పోస్టును అనుసరించి డిగ్రీ, బీఈ, బీటెక్‌, సీఏ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • పోస్టులను అనుసరించి 25 నుంచి 45 ఏళ్లు వయసు కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

  • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • పోస్టులను అనుసరించి 50 వేల నుంచి 36లక్షల వరకు జీతం పొందొచ్చు.

దరఖాస్తు ఫీజు:

  • యూఆర్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తులు ప్రారంభం:

  • 05-06-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 30-06-2024