iDreamPost
android-app
ios-app

ITI, డిప్లొమా పాసయ్యారా? ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే.. నెలకు 44 వేల జీతం

UCSL Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఐటీఐ, డిప్లొమా పాసైన వారికి గోల్డెన్ ఛాన్స్. పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. త్వరగా అప్లై చేసుకోండి.

UCSL Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఐటీఐ, డిప్లొమా పాసైన వారికి గోల్డెన్ ఛాన్స్. పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. త్వరగా అప్లై చేసుకోండి.

ITI, డిప్లొమా పాసయ్యారా? ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే.. నెలకు 44 వేల జీతం

ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఉద్యోగాల భర్తీ కోసం భారీగా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే వారికి ఇదే మంచి ఛాన్స్. మంచి జీతంతో కూడిన ఈ ఉద్యోగాలను సాధిస్తే లైఫ్ లో సెట్ అయిపోవచ్చు. మరి మీరు కూడా గవర్నమెంట్ కొలువుల కోసం ప్రిపేర్ అవుతున్నారా? మీరు ఐటీఐ, డిప్లొమా పాసై ఖాళీగా ఉన్నారా? అయితే మీకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే ఛాన్స్ వచ్చింది. కర్ణాటక రాష్ట్రం మాల్పేలోని ఉడిపి కొచ్చిన్‌ షిప్‌యార్డు లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 44 వేల జీతం అందుకోవచ్చు.

ఉడిపి కొచ్చిన్‌ షిప్‌యార్డు లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ చేయనుంది. మొత్తం 16 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా (మెకానికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రికల్‌), డిగ్రీ (ఆర్ట్స్‌/ కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు. అభ్యర్థుల వయసు 45 ఏళ్లకు మించకూడదు. వయో సడలింపు నిబంధనలు వర్తిస్తాయి. అర్హత, ఆసక్తి ఉన్నవారు జులై 12 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

సూపర్‌వైజర్ పోస్టుల సంఖ్య: 16

విభాగాలవారీగా ఖాళీలు:

  • సూపర్‌వైజర్(మెకానికల్): 07
  • సూపర్‌వైజర్(ఎలక్ట్రికల్‌): 05
  • సూపర్‌వైజర్(పెయింటింగ్‌): 02
  • సూపర్‌వైజర్(స్కాఫ్‌ఫోల్డింగ్‌): 01
  • సూపర్‌వైజర్(హెచ్‌ఆర్): 01

అర్హత:

  • పోస్టులను అనుసరించి ఐటీఐ, డిప్లొమా (మెకానికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రికల్‌), డిగ్రీ (ఆర్ట్స్‌/ కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • 12.07.2024 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయో సడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌, ప్రాక్టికల్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • మొదటి సంవత్సరం రూ.40,650, రెండవ సంవత్సం రూ.41,490, మూడవ సంవత్సరం రూ.42,355, నాల్గొవ సంవత్సరం రూ.43,246, ఐదొవ సంవత్సరం రూ.44,164.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 12-07-2024