iDreamPost
android-app
ios-app

10th, ఇంటర్ పాసయ్యారా?.. ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పుడే అప్లై చేసుకోండి

  • Published Jun 18, 2024 | 12:41 PM Updated Updated Jun 18, 2024 | 12:41 PM

టెన్త్, ఇంటర్ పాసైన వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే అవకాశం వచ్చింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. వెటనే అప్లై చేసుకోండి.

టెన్త్, ఇంటర్ పాసైన వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే అవకాశం వచ్చింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. వెటనే అప్లై చేసుకోండి.

10th, ఇంటర్ పాసయ్యారా?.. ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పుడే అప్లై చేసుకోండి

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నట్లైతే ఇదే మంచి ఛాన్స్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రిలీజ్ అవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగ పెట్టుకున్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్. మరి మీరు టెన్త్, ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నారా? గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. పదో తరగతి, ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే ఛాన్స్ వచ్చింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 29200 జీతం అదుకోవచ్చు.

డిఫెన్స్ లో కెరియర్ ప్రారంభించాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఇండియన్ కోస్ట్ గార్డ్ 320 నావిక్ (జనరల్ డ్యూటీ), యాంత్రిక్ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్) పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పోస్టులని అనుసరించి ఇంటర్ (మ్యాథ్స్/ ఫిజిక్స్‌), టెన్త్ తరగతితో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 18-22 ఏళ్ల వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న వారు జులై 3 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

ఖాళీల సంఖ్య:

  • 320

నావిక్(జనరల్ డ్యూటీ): 260 పోస్టులు

రీజియన్‌/ జోన్‌ వారీగా ఖాళీలు:

  • నార్త్‌: 77
  • వెస్ట్: 66
  • నార్త్ ఈస్ట్: 68
  • ఈస్ట్‌: 34
  • నార్త్ వెస్ట్: 12
  • అండమాన్ అండ్‌ నికోబార్: 03.

అర్హత:

  • కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ చే గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి 12వ తరగతి (మ్యాథ్స్/ ఫిజిక్స్‌) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • 18 – 22 సంవత్సరాల మధ్య ఉండాలి. అనగా 01.03.2003 నుంచి 28.02.2007 మధ్య జన్మించి ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

యాంత్రిక్ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్): 60 పోస్టులు.

విభాగాలవారీగా ఖాళీలు:

  • మెకానికల్: 33
  • ఎలక్ట్రికల్: 18
  • ఎలక్ట్రానిక్స్: 09

అర్హత:

  • 10వ తరగతి లేదా 12వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • 18 – 22 సంవత్సరాల మధ్య ఉండాలి. అనగా 01.03.2003 నుంచి 28.02.2007 మధ్య జన్మించి ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

పరీక్ష ఫీజు:

  • రూ.300. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలలో భాగంగా, రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • నెలకు నావిక్ పోస్టులకు రూ.21,700. యాంత్రిక్ పోస్టులకు రూ.29,200.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 13-06-2024

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 03-07-2024