P Venkatesh
TG Lab Technician Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణలో 1284 ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.
TG Lab Technician Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణలో 1284 ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.
P Venkatesh
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పలు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రేవంత్ సర్కార్ వరుస నోటిఫికేషన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. భారీగా జాబ్స్ ను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకొంటుంది. ఈ క్రమంలో తాజాగా 1284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నది. మరి ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు? వయోపరిమితి ఎంత? ఆ వివరాలు మీకోసం.
తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్, హెల్త్ డిపార్ట్‌మెంట్లలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు లేబోరేటరీ టెక్నీషియన్ కోర్సులో సర్టిఫికేట్ కలిగి ఉండాలి. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు. బీఎస్సీ (ఎంఎల్ టీ) ఎంఎస్సీ (ఎంఎల్టీ). ఎంఎస్సీ ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ, ఎంఎస్సీ ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ ఇన్ బయోకెమిస్ట్రీ వంటి కోర్సుల్లో ఏదైనా ఒక కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 18-46 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 21 నుంచి అప్లై చేసుకోవాలి. ఆన్ లైన్ దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ అక్టోబర్ 5.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష నవంబర్ 10న నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టుల్లో 1,088 డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, డెరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) డిపార్ట్‌మెంట్, మరో 183 తెలంగాణ వైద్య విధాన పరిషద్ ఆసుపత్రులు, 13 పోస్టులు హైదరాబాద్ ఎంజేజే హాస్పిటల్ లో భర్తీ కానున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు రూ. 32,810 నుంచి రూ.96,890 డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, డెరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు అందించనున్నారు. ఇక ఎంజేజే హాస్పిటల్ పోస్టులకు రూ.31,040-రూ.92,050 అందిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రూ.500 పరీక్ష ఫీజు, రూ.200 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.