iDreamPost
android-app
ios-app

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ. 75 వేల జీతం.. ఈ అర్హతలు ఉండాలి!

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 75 వేలు జీతం అందుకోవచ్చు.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 75 వేలు జీతం అందుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ. 75 వేల జీతం.. ఈ అర్హతలు ఉండాలి!

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీ వేతనంతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. కొడితే ఇలాంటి జాబ్స్ కొట్టి లైఫ్ లో సెటిల్ అయిపోవాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇది ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం మరియు ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ యొక్క అడ్మినిస్ట్రేటివ్ నియంత్రణలో ఉన్న ఒక చట్టబద్ధమైన సంస్థ. భారతదేశం యొక్క నేషనల్ స్టాండర్డ్స్ బాడీ ఆఫ్ ఇండియా మరియు దేశంలోని స్టాండర్డైజేషన్, ప్రోడక్ట్ అండ్ సిస్టమ్ సర్టిఫికేషన్, హాల్‌మార్కింగ్, లాబొరేటరీ టెస్టింగ్ మొదలైన రంగంలో కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది.

కాగా బీఐఎస్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 107 కన్సల్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం బీఐఎస్ అధికారిక వెబ్ సైట్ https://www.bis.gov.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

  • మొత్తం కన్సల్టెంట్‌ పోస్టులు :
  • 107

విభాగాల వారీగా ఖాళీలు:

  • సివిల్‌ ఇంజినీరింగ్‌: 15
  • కెమికల్‌: 06
  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ: 03
  • ఎలక్ట్రోటెక్నికల్: 06
  • ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌: 06
  • మెకానికల్‌ ఇంజినీరింగ్‌: 07
  • మెడికల్‌ ఎక్యుప్‌మెంట్‌ అండ్‌ హస్పిటల్‌ ప్లానింగ్‌: 02
  • మెట‌ల‌ర్జిక‌ల్ ఇంజినీరింగ్‌: 09
  • పెట్రోలియం, కోల్‌ అండ్‌ రిలేటెడ్‌ ప్రొడక్ట్స్‌: 05
  • ప్రొడక్షన్ అండ్‌ జనరల్‌ ఇంజినీరింగ్‌: 10
  • టెక్స్‌టైల్‌: 08
  • ట్రాన్స్‌పోర్ట్‌ ఇంజినీరింగ్‌: 07
  • వాటర్ రీసోర్సెస్‌: 06
  • సర్వీస్‌ సెక్టార్‌: 08
  • మేనేజ్‌మెంట్‌ అండ్‌ సిస్టమ్‌: 05
  • ఆయూష్‌: 04

అర్హత:

  • పోస్టులను బట్టి టింబర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ/ టెక్నాలజీ ఫారెస్ట్‌, సివిల్/ఫైర్‌/మెట‌ల‌ర్జి, స్ర్టక్చరల్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌, పాలీమర్‌ ఇంజినీరింగ్‌/ఎంఎస్సీ కెమిస్ట్రీలో డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ ఎంటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు సంబంధిత రంగంలో పనిఅనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్ధుల వయసు 65 సంవత్సరాలు మించకూడదు.

కాలవ్యవధి:

  • పూర్తిగా ఒక సంవత్సరం పాటు ఒప్పందంపై ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు అందరు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

ఎంపిక విధానం:

  • అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.75,000 ఉంటుంది.

దరఖాస్తులు ప్రారంభ తేదీ:

  • 30-12-2023

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 19-01-2024

బీఐఎస్ అధికారిక వెబ్ సైట్:

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి