iDreamPost
android-app
ios-app

Bank జాబ్ కావాలా? డిగ్రీ పాసైతే చాలు.. 2,700 Bank ఉద్యోగాలు మీవే.. మంచి జీతం

  • Published Jul 02, 2024 | 12:43 PM Updated Updated Jul 02, 2024 | 12:43 PM

PNB Apprentice Recruitment 2024: బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. 2,700 బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

PNB Apprentice Recruitment 2024: బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. 2,700 బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

Bank జాబ్ కావాలా? డిగ్రీ పాసైతే చాలు.. 2,700 Bank ఉద్యోగాలు మీవే.. మంచి జీతం

బ్యాంక్ జాబ్స్ కు ఎలాంటి డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన బ్యాంకుల్లో ఉద్యోగాలను సాధించేందుకు యువత నిరంతరం శ్రమిస్తుంటారు. బ్యాంకు జాబ్ లక్ష్యంగా పెట్టుకుని ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతుంటారు. ఒత్తిడి లేని విధులు, మంచి జీతం ఉంటుండడంతో బ్యాంక్ ఉద్యోగాలకు ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. మరి మీరు కూడా బ్యాంక్ ఉద్యోగం కావాలనుకుంటున్నారా? మీరు డిగ్రీ పాసైతే చాలు బ్యాంక్ జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ మానవ వనరుల విభాగం దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 2,700 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో జులై 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష, లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థుల వయసు 20-28 ఏళ్ల వరకు కలిగి ఉండాలి. ఎంపికైనవారికి నెలకు రూరల్/ సెమీ అర్బన్ ప్రాంతాల్లో అయితే రూ.10,000; పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.12,000. మెట్రో ప్రాంతాల్లో అయితే రూ.15,000 స్టైపెండ్ చెల్లిస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

అప్రెంటిస్‌ పోస్టుల సంఖ్య: 2,700

ఆంధ్రప్రదేశ్: 27

తెలంగాణ: 34

అర్హత:

  • అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • 30.06.2024 నాటికి 20 – 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్‌, ఓబీసీలకు రూ.944. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.708. దివ్యాంగులకు రూ.472.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

శిక్షణ వ్యవధి:

  • ఒక సంవత్సరం.

ఎంపిక విధానం:

  • ఆన్‌లైన్ రాత పరీక్ష, లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.

స్టైపెండ్:

  • నెలకు రూరల్/ సెమీ అర్బన్ ప్రాంతానికి రూ.10,000. పట్టణ ప్రాంతానికి రూ.12,000. మెట్రో ప్రాంతానికి రూ.15,000.

రిజిస్ట్రేషన్ ప్రారంభం:

  • 30-06-2024

రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ:

  • 14-07-2024