iDreamPost
android-app
ios-app

కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ. 85 వేల జీతం.. అర్హులు ఎవరంటే?

ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు తీపి కబురు అందించింది నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి సమాచారం మీ కోసం..

ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు తీపి కబురు అందించింది నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి సమాచారం మీ కోసం..

కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ. 85 వేల జీతం.. అర్హులు ఎవరంటే?

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉద్యోగా భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వరా మొత్తం 274 ఉద్యోగాలన భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన  అభ్యర్థులు నెలకు రూ. 85 వేల వేతనాన్ని పొందొచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత , ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 22 2024 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అప్లై చేసుకోదలిచిన ఆశావాహులు పూర్తి సమాచారం కోసం ఎన్ఐసీఎల్ అధికారిక వెబ్ సైట్ https://nationalinsurance.nic.co.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

  • నేషనల్​ ఇన్సూరెన్స్ కంపెనీ​ లిమిటెడ్​

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ మొత్తం ఖాళీలు:

  • 274

విభాగాల వారీగా ఖాళీలు:

  • డాక్టర్ (ఎంబీబీఎస్​) పోస్టులు 28 , లీగల్ పోస్టులు 20, ఫైనాన్స్ పోస్టులు30, యాక్చుయేరియల్ పోస్టులు02, ఇనఫర్మేషన్​ టెక్నాలజీ పోస్టులు 20, ఆటోమొబైల్​ ఇంజినీర్స్ పోస్టులు 20, హిందీ(రాజ్యభాషా) ఆఫీసర్స్ పోస్టులు 22, జనరలిస్ట్ పోస్టులు 130, బ్యాక్​లాగ్ పోస్టులు 02 ఉన్నాయి.

అర్హతలు:

  • అభ్యర్థులు పోస్టులను అనుసరించి ఎంబీబీఎస్​, ఎండీ, ఎంఎస్​, ఎంఎస్​సీ, పీజీ – మెడికల్​ డిగ్రీ, లా, బీ.కామ్​, ఎం.కామ్​, బీఈ, బీటెక్​, ఎం.టెక్ విద్యార్హతలను కలిగి ఉండాలి. హిందీ ఆఫీసర్​ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీలో హిందీ లేదా ఇంగ్లిష్​ సబ్జెక్ట్​లో సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులను పొంది ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 21 నుంచి 30 ఏళ్లలోపు అభ్యర్థులు అప్లై చేయొచ్చు.

ఎంపిక ప్రక్రియ:

  • అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఆధారంగా ఎంపిక చేస్తారు. హిందీ ఆఫీసర్​ పోస్టులకు ఎటువంటి ప్రిలిమ్స్​ పరీక్ష ఉండదు.

వేతనం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 85 వేలు అందిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.250 చెల్లించాలి. ఇతర కేటగిరీల అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.1000 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

అప్లికేషన్ ప్రారంభ తేదీ:

  • 02-01-2024

అప్లికేషన్ చివరి తేదీ:

  • 22-01-2024

ఎన్​ఐసీఎల్​ అధికారిక వెబ్​సైట్: