iDreamPost
android-app
ios-app

భారీ వేతనంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే?

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే మీకు భారీ శుభవార్త. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీ వేతనంతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆ ఉద్యోగాలకు అర్హులు ఎవరంటే?

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే మీకు భారీ శుభవార్త. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీ వేతనంతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆ ఉద్యోగాలకు అర్హులు ఎవరంటే?

భారీ వేతనంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే?

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లైతే ఇంతకు మించిన అవకాశం మళ్లీ రాదు. భారీ వేతనంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఏ నోటిఫికేషన్ ను వదిలినా దీనిని మాత్రం వదలొద్దు. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంఎస్సీ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి జీవితంలో సెటిల్ అయిపోవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమైతే ఈ జాబ్స్ ను మాత్రం విడిచిపెట్టొద్దు. ఇంటెలిజెన్స్ బ్యూరో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 226 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకొవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న వారు జనవరి 12 2024 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా అప్లై చేసుకోండి. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిక వెబ్ సైట్ https://www.mha.gov.in/en ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 226

విభాగాల వారీ పోస్టులు:

  • కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 79 పోస్టులు
  • ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్: 147 పోస్టులు

విద్యార్హత:

  • గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచి బీఈ, బీటెక్‌ (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలి-కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ ఐటీ/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్). లేదా ఎంఎస్సీ (ఎలక్ట్రానిక్స్/ ఫిజిక్స్- ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ కంప్యూటర్ సైన్స్) లేదా మస్టర్స్ డిగ్రీ (కంప్యూటర్ అప్లికేషన్స్). గేట్ 2021/ 2022/ 2023 ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి :

  • అభ్యర్థులు 12.01.2024 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

అప్లికేషన్ ఫీజు:

  • జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.

అప్లికేషన్ విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక ప్రక్రియ:

  • అభ్యర్థులను గేట్ స్కోరు, ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్/ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వేతనం:

  • ఎంపికైన వారిక నెలకు రూ.44,900 – రూ.1,42,400 వరకు అందిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 23-12-2023.

దరఖాస్తుకు చివరితేది:

  • 12-01-2024.

ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిక వెబ్ సైట్: