iDreamPost
android-app
ios-app

ఈ జాబ్స్ కొడితే లైఫ్ సెట్.. JIPMERలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం!

ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తాజగా జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్‌ రిసెర్చ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆ వివరాలు మీకోసం..

ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తాజగా జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్‌ రిసెర్చ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆ వివరాలు మీకోసం..

ఈ జాబ్స్ కొడితే లైఫ్ సెట్.. JIPMERలో ఉద్యోగాలు.. నెలకు రూ.  లక్షకు పైగా జీతం!

ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమంటే కాస్త కష్టంతో కూడుకున్న పనే అని చెప్పాలి. దేశంలో పట్టాభద్రుల సంఖ్య ప్రతి ఏడు పెరిగిపోతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు వందల్లో ఉంటే అభ్యర్థులు మాత్రం లక్షల్లో ఉంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంత కాంపిటీషన్ ఉంటుందో ఇక వేరే చెప్పక్కర్లేదు. ప్రభత్వ ఉద్యోగాలకు పోటీ ఎంతున్న సరే మీరు కాస్త కష్టపడి ఈ ఉద్యోగాలను సాధించినట్లైతే మీ లైఫ్ సెట్ అయిపోతది. తాజగా జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్‌ రిసెర్చ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారికి అదిరిపోయే శుభవార్తను అందించింది పుదుచ్చేరిలోని జిప్మర్. రెగ్యులర్ ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 82 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు నెలకు ఏకంగా రూ. లక్షకు పైగా జీతాన్ని పొందొచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసుకునేందుకు జనవరి 8 2024 వరకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్‌ రిసెర్చ్ అధికారిక వెబ్ సైట్ https://jipmer.edu.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

JIPMERలో ఉద్యోగ ఖాళీలు

  • సీనియర్ రెసిడెంట్

మొత్తం పోస్టులు:

  • 82

విభాగాలవారీగా ఖాళీలు:

  • అనస్థీషియాలజీ & క్రిటికల్ కేర్ 11, అనాటమీ 01, బయోకెమిస్ట్రీ 03, డెర్మటాలజీ 02, ఎమర్జెన్సీ మెడిసిన్, 02 ఈఎన్‌టీ 01, ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ 04, జనరల్ మెడిసిన్ 06, జనరల్ సర్జరీ 09, గెరియాట్రిక్ మెడిసిన్ 01, మైక్రోబయాలజీ 05, నియోనాటాలజీ 01, న్యూక్లియర్ మెడిసిన్ 03, అబ్‌స్టేట్రిక్స్ & గైనకాలజీ 03, ఆప్తాల్మాలజీ 04, ఆర్థోపెడిక్స్ 04, పీడియాట్రిక్స్ 04, ఫార్మకాలజీ 01, సైకాలజీ 02, ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ 01, ఫిజికల్ మెడిసిన్ & రిహాబిలిటేషన్ 02, పాథాలజీ 01, సైకియాట్రీ 02, పల్మొనరీ మెడిసిన్ 04, రేడియేషన్ ఆంకాలజీ 01, రేడియో డయాగ్నసిస్ 04 ఉద్యోగ ఖాళీలున్నాయి.

విద్యార్హత:

  • అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • 28.02.2024 నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

అప్లికేషన్ ఫీజు:

  • జనరల్, ఈడబ్య్లూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1200 చెల్లించాలి. దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్.

ఎంపిక విధానం:

  • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.1,10,000 (బేసిక్ పే రూ.67,700) అందిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 19-12-2023.

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 08-01-2024.

JIPMER అధికారిక వెబ్ సైట్:

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి