iDreamPost
android-app
ios-app

HYDలోని మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు.. నెలకు రూ. 87 వేల వరకు జీతం

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లైతే ఇదే మంచి అవకాశం. హైదరాబాద్‌లోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి వివరాలు మీకోసం..

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లైతే ఇదే మంచి అవకాశం. హైదరాబాద్‌లోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి వివరాలు మీకోసం..

HYDలోని మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు.. నెలకు రూ. 87  వేల వరకు జీతం

ఉద్యోగాల కోసం ఎదరుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి జీవితంలో స్థిర పడాలనుకునే వారికి సువర్ణావకాశం. హైదరాబాద్‌లోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 31 పోస్టులను భర్తీ చేయనున్నారు. మేనేజర్, సోషల్ వర్కర్, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం, ప్రీ-స్కూల్ టీచర్, పీడియాట్రీషియన్, చౌకీదార్, ఆయా, డేటా ఎంట్రీ ఆపరేటర్, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్‌వైజర్, కేస్ వర్కర్ పోస్టులు ఉన్నాయి.

హైదరాబాద్ లోని మహిళా శిశు సంక్షేమ శాఖలో భర్తీ కానున్న ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 29 వరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలిని కోరింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు హైదరాబాద్‌ జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్ సైట్ https://hyderabad.telangana.gov.in/ ను పరిశీలించాలని కోరింది. ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు? జీతం ఎంత? వయోపరిమితి తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 31

పోస్టుల వివరాలు:

  • మేనేజర్ 04, సోషల్ వర్కర్03, జీఎన్‌ఎం01, ఏఎన్‌ఎం03, ప్రీ-స్కూల్ టీచర్01, పీడియాట్రిషియన్01, చౌకీదార్02, ఆయా02, డేటా ఎంట్రీ ఆపరేటర్01, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్‌వైజర్02, కేస్ వర్కర్ 11 పోస్టులున్నాయి.

అర్హత:

  • పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • పోస్టులను అనుసరించి అభ్యర్థుల వయసు 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు ఉన్నవారు అర్హులు. కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

జీతం:

  • మేనేజర్ పోస్టులకు రూ. 23170, సోషల్ వర్కర్ రూ. 18536, జీఎన్‌ఎం రూ. 23400, ఏఎన్‌ఎం రూ. 13240, ప్రీ-స్కూల్ టీచర్ రూ. 13000, పీడియాట్రిషియన్ రూ. 87750, చౌకీదార్ రూ. 14500, ఆయా రూ. 7944, డేటా ఎంట్రీ ఆపరేటర్ రూ. 11916, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్‌వైజర్ రూ. 19500, కేస్ వర్కర్ రూ. 15600 వేతనంగా అందిస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆఫ్‌ లైన్‌

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

  • ఆఫ్ లైన్ దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, 4వ ఫ్లోర్, స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్, కలెక్టరేట్, లక్డీకాపూల్, హైదరాబాద్ చిరునామాకు పంపించాలి.

అప్లికేషన్ ప్రారంభ తేదీ:

  • 16-12-2023

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 29-12-2023

అధికారిక వెబ్‌సైట్‌:

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి