iDreamPost
android-app
ios-app

డిగ్రీ పాసైతే చాలు.. LIC హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలు.. త్వరగా అప్లై చేసుకోండి

నిరుద్యోగులకు శుభవార్త. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. త్వరగా అప్లై చేసుకోండి.

నిరుద్యోగులకు శుభవార్త. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. త్వరగా అప్లై చేసుకోండి.

డిగ్రీ పాసైతే చాలు.. LIC హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలు.. త్వరగా అప్లై చేసుకోండి

ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు భారీ శుభవార్త. మీరు కేవలం డీగ్రీ పాసైతే చాలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మీరు డిగ్రీ ఉత్తీర్ణులై ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే మీకు ఇది మంచి అవకాశం. తాజాగా ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 250 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 49 ఖాళీలున్నాయి. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్‌ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి వివరాలకు ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌ అధికారిక వెబ్ సైట్ https://www.lichousing.com/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్య సమాచారం :

  • ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌ అప్రెంటిస్‌ మొత్తం ఖాళీలు:
  • 250

తెలంగాణలోని ఖాళీల వివరాలు:

  • బాలానగర్ 1, ఘట్ కేసర్ 1, హైదరాబాద్ 17, సికింద్రాబాద్ 4, హన్మకొండ 2, కరీంనగర్ 2 , నాయుడు పేట్ 1, నిజామాబాద్ 1, సిద్దిపేట్ 1 ఖాళీలున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లోని ఖాళీల వివరాలు:

  • భీమిలి1, గన్నవరం 1, క్రిష్ణ 2, విజయవాడ 2, విశాఖ పట్నం 4, గుంటూరు 1, ఖబ్బం1, మచిలీ పట్నం 1, నర్సారావు పేట 1, తిరుపతి 2, తుని 1, విజయవాడ 1, విజయనగరం 1 ఖాళీలున్నాయి.

శిక్షణ వ్యవధి:

  • 12 నెలలు.

అర్హత:

  • ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 01-12-2023 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టైపెండ్:

  • నెలకు రూ.9,000 – రూ.15,000గా ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్, ఓబీసీలకు రూ.944. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.708. దివ్యాంగ అభ్యర్థులకు రూ.472 చెల్లించాలి.

దరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 22-12-2023

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 31-12-2023

ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌ అధికారిక వెబ్ సైట్:

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి