iDreamPost
android-app
ios-app

ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. నెలకు లక్షకు పైగా జీతం!

ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ తాజాగా నిరుద్యోగులకు ఓ శుభావార్తను అందించింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ తాజాగా నిరుద్యోగులకు ఓ శుభావార్తను అందించింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. నెలకు లక్షకు పైగా జీతం!

చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కల ఉంటుంది. దీని కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా అనుక్షణం పుస్తకాలతో కుస్తి పడుతూ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే, డిగ్రీ పూర్తైన తర్వాత ఒక్కోరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటుంటారు. కొందరు బిజినెస్ చేస్తే మరి కొందరు మాత్రం.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు చాలా మంది పోటీ పడుతుంటారు. వచ్చిన ప్రతీ నోటిఫికేషన్ కు అప్లయ్ చేస్తూ ఆ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. కాగా, ఈ మధ్య ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ కూడా ఎక్కువగానే ఉంది.

దీంతో నిరుద్యోగ యువతి, యువకులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అందులో కొన్ని ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అసలు ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? అర్హతలు ఏంటి? దరఖాస్తు చివరి తేది ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో కొన్ని పోస్టులకు తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్-II/ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు అధికారికంగా తెలిపింది.

అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని కూడా తెలిపింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైన గుర్తింపు పొందిన బోర్డుల, యూనిర్సిటీల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేయదలచిన అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక వయసు సడలింపులో భాగంగానే OBCలకు మూడు సంవత్సరాలు కాగా, SC,STలకు 5 ఏళ్ల సడలింపు ఉంటుందని ప్రకటనలో తెలిపారు. ఇక దరఖాస్తు ఈ నెల 25 నుంచి ప్రారంభమై డిసెంబర్ 15తో ముగిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశమనే చెప్పాలి. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవాలనుకునేవారు అధికారిక వెబ్ సైట్ లో చూడొచ్చు.