ఫ్రెషర్లకు Infosys భారీ ఆఫర్.. ఏకంగా 9 లక్షల ప్యాకేజీతో!

Infosys Power Programme-Freshers: ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ భారీ బంపరాఫర్ ప్రకటించింది. ఏకంగా 9 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేయనుంది. ఆ వివరాలు..

Infosys Power Programme-Freshers: ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ భారీ బంపరాఫర్ ప్రకటించింది. ఏకంగా 9 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేయనుంది. ఆ వివరాలు..

కొన్ని రోజుల క్రితం వరకు ఐటీ కంపెనీలు, ఎంఎన్సీలకు సంబంధించి.. ఉద్యోగుల తొలగింపు వార్తలనే చూశాం. ఒక్క ఉద్యోగం కోసం వందల సంఖ్యలో అభ్యర్థులు ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వడం వంటి సంఘటనలు చూశాం. ఇక తాజాగా కాగ్నిజెంట్ ఫ్రెషర్లకు ఇచ్చే ప్యాకేజీకి సంబందించిన వార్తలు ఎంత వైరల్ అయ్యాయో గమనించాం. ఇవన్నీ గమనిస్తే.. ప్రస్తుతం ఐటీ రంగంలో ఎంత సంక్షోభం ఉందో అనే ఆందోళనలు కలిగాయి. కానీ తాజాగా ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ చేసిన ప్రకటన చూసి ఉద్యోగులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఫ్రెషర్ల కోసం ఏకంగా 9 లక్షల ప్యాకేజీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..

దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్.. ఫ్రెషర్ల కోసం వారిని నియమించుకునేందుకు వినూత్న ప్రోగ్రామ్ డిజైన్ చేసింది. ఇన్ఫోసిస్ పవర్ ప్రోగ్రామ్ పేరిట దీనిని లాంఛ్ చేసింది. దీనిని క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం రూపొందించగా.. ఈ ప్రోగ్రామ్ కింద ఎంపికైన ఫ్రెషర్లకు ఏడాదికి ఏకంగా రూ. 9 లక్షల వరకు వార్షిక ప్యాకేజీ ఉంటుందని తెలిపింది.

సాధారణంగా అయితే ఇన్ఫోసిస్.. ఫ్రెషర్లకు రూ. 3-రూ. 3.5 లక్షల వరకు ప్యాకేజీ ఆఫర్ చేస్తుంటుంది. ఇక ఇటీవలి కాలంలో అత్యాధునిక టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో మంచి కోడింగ్ స్కిల్స్, ఇతర డిజైనింగ్ స్కిల్స్ ఉన్న ప్రతిభ గలవారిని ఆకర్షించేందుకు కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. కోడింగ్, సాఫ్ట్‌వేర్‌లో సవాళ్లు, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు ఉన్న వారికే ఈ పవర్ ప్రోగ్రామ్‌లో ప్రాధాన్యం ఉంటుందని సంస్థ తెలిపింది.

ఇక పలు రంగాల్లో వారి నైపుణ్యల్ని పరిశీలించిన తర్వాత.. ఎంపిక చేయనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగానే క్యాంపస్ ప్లేస్మెంట్లలో వీరికి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇక స్టార్టింగ్ శాలరీలు రూ. 4-6.5 లక్షల నుంచి మొదలుకొని.. గరిష్టంగా ఏడాదికి రూ. 9 లక్షల వరకు ఆఫర్ చేస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి.

గత సంవత్సరం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇలాంటి నియామక ప్రక్రియనే తీసుకొచ్చింది. ప్రైమ్ పేరిట ప్రారంభించిన ఈ ప్రోగ్రామ్ లో భాగంగా.. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఉద్యోగం కోసం ఎంపికైన వారికి ఏటా రూ. 9 నుంచి 11 లక్షలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇన్ఫోసిస్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది.

Show comments