iDreamPost
android-app
ios-app

ఆర్మీలో NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్.. ఈ అర్హతలుండాలి.. నెలకు రూ.56,100 జీతం

ఇండియన్ ఆర్మీలో చేరాలనుకుంటున్నారా? దేశ సైనికులుగా చేరి సేవ చేయాలని భావిస్తున్నారా? అయితే యువతకు ఇండియన్ ఆర్మీ గుడ్ న్యూస్ అందించింది. ఇండియన్ ఆర్మీలో 'ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్' 56వ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.

ఇండియన్ ఆర్మీలో చేరాలనుకుంటున్నారా? దేశ సైనికులుగా చేరి సేవ చేయాలని భావిస్తున్నారా? అయితే యువతకు ఇండియన్ ఆర్మీ గుడ్ న్యూస్ అందించింది. ఇండియన్ ఆర్మీలో 'ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్' 56వ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.

ఆర్మీలో NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్.. ఈ అర్హతలుండాలి.. నెలకు రూ.56,100 జీతం

దేశ రక్షణలో కీలక పాత్ర వహిస్తున్న సైనికులకు సమాజంలో ఎనలేని గౌరవం. అందుకే యువత ఆర్మీలో చేరాలని కలలుకంటుంటారు. ఆర్మీలో సైనికులుగా చేరి దేశానికి తమ వంతు సేవ చేయాలని భావిస్తుంటారు. ఇలా ఆర్మీలో చేరాలనుకునే వారికి గుడ్ న్యూస్. మీరు డిగ్రీ పాసైతే చాలు ఆర్మీలో చేరొచ్చు. తాజాగా ఇండియన్ ఆర్మీలో ‘ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్’ 56వ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ఎంపికైతే ఆఫీసర్ పోస్టులను దక్కించుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 56,100 జీతాన్ని అందిస్తారు. షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లుగా చేరేందుకు 2024 అక్టోబరులో ప్రారంభమయ్యే కోర్సులో ప్రవేశాలకు అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఏదైనా డిగ్రీతోపాటు ఎన్‌సీసీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో ఫిబ్రవరీ 06 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్ సైట్ https://joinindianarmy.nic.in/ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

  • ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ (56వ కోర్సు) – షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్‌సీ) ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు:

55

ఎన్‌సీసీ (పురుషులు):

  • 50 పోస్టులు

ఎన్‌సీసీ (మహిళలు):

  • 05 పోస్టులు

అర్హత:

  • అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు ఎన్‌సీసీ‌ సర్టిఫికెట్ ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. వీరికి ఎన్‌సీసీ సర్టిఫికెట్ అవసరం లేదు.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 01.07.2024 నాటికి 19-25 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • అకాడమిక్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారికి ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇది రెండు దశల్లో ఈ ప్రక్రియ ఉంటుంది. స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు ఉంటాయి.

జీతం:

  • ఎంపికైన వారికి నెలకు రూ.56,100 చెల్లిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత లెఫ్టినెంట్ హోదాలో పోస్టింగ్ ఇస్తారు. నిర్ణీత పేస్కేలు ప్రకారం ఇతర అలవెన్సులు ఇస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 08-01-2024.

దరఖాస్తుకు చివరితేది:

  • 06-02-2024.

ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్ సైట్: