P Venkatesh
నిరుద్యోగులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇంటర్ ఆర్హతతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామాకాలకు సంబంధించి అగ్నివీర్ వాయు ఇన్ టెక్ (01/2025) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
నిరుద్యోగులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇంటర్ ఆర్హతతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామాకాలకు సంబంధించి అగ్నివీర్ వాయు ఇన్ టెక్ (01/2025) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
P Venkatesh
భారత త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. శత్రు రాజ్యాల నుంచి, ఉగ్ర వాదుల నుంచి ఎదురయ్యే దాడులను నిలువరించి దేశ సంపదను, ప్రజల ప్రాణాలను రక్షించడంలో భారత వాయుసేన ముఖ్యపాత్ర వహిస్తుంది. మరి ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తుంది. కేవలం ఇంటర్ మీడియట్ అర్హతతో భారతీయ వాయుసేనలో చేరొచ్చు. తాజాగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామాకాలకు సంబంధించి అగ్నివీర్ వాయు ఇన్ టెక్ (01/2025) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు గల అవివాహిత పురుషులతో పాటు, మహిళా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థుల సంఖ్య మరియు ఉద్యోగావకాశాలు సర్వీస్ అవసరాలకు అనుగుణంగా నిర్ణయించబడతాయి. అగ్నివీర్ వాయు పోస్టులకు ఎంపికైన వారు నాలుగేళ్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో సేవలందిస్తారు. ఆ తర్వాత వీరిలో 25శాతం మందిని శాశ్వత ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. మిగతా వారిని సర్టిఫికేట్, ఆర్థిక ప్రోత్సాహకాలతో తొలగిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఫిబ్రవరి 6వ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు పూర్తి వివరాలకు ఐఏఎఫ్ అధికారిక వెబ్ సైట్ https://agnipathvayu.cdac.in/AV/ను పరిశీలించాల్సి ఉంటుంది.