iDreamPost
android-app
ios-app

టెన్త్ అర్హతతో IBలో ఉద్యోగాలు.. నెలకు రూ. 69 వేల జీతం!

ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది.

ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది.

టెన్త్ అర్హతతో IBలో ఉద్యోగాలు.. నెలకు రూ. 69 వేల జీతం!

మీరు పదో తరగతి ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలోని నిఘా విభాగంలో 677 పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు సంబంధిత ప్రక్రియను ప్రారంభించారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://www.mha.gov.in/en ను సందర్శించాలని కోరింది.

ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో 677 ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఇంకా వారం రోజులు మాత్రమే గడువు ఉంది. కాగా భర్తీ చేయనున్న పోస్టుల్లో 362 సెక్యూరిటీ అసిస్టెంట్‌- మోటార్‌ ట్రాన్స్‌పోర్టు (డ్రైవర్‌) పోస్టులు ఉండగా.. 315 మల్టీ టాస్కింగ్‌ సిబ్బంది పోస్టులు ఉన్నాయి. పదో తరగతి లేదా తత్సమాన కోర్సులు చేసినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. కాగా ఈ పోస్టులకు అక్టోబర్ 13 2023 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవ్వగా నవంబర్ 13 2023న ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగియనున్నది.

ముఖ్యమైన సమాచారం.

పోస్టులు మొత్తం

677

వయో పరిమితి:

సెక్యూరిటీ అసిస్టెంట్‌ పోస్టులకు 27 ఏళ్లు మించరాదు. ఎంటీఎస్‌ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు:

సెక్యూరిటీ అసిస్టెంట్‌- మోటార్‌ ట్రాన్స్‌పోర్టు పోస్టులకు రూ.21,700- రూ.69,100; మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులకు రూ.18వేలు నుంచి రూ.56,900

ఎంపిక ప్రక్రియ:

రాత పరీక్ష, డ్రైవింగ్‌ నైపుణ్యాలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు ప్రారంభం.

అక్టోబర్‌ 14 2023

దరఖాస్తులకు చివరి తేదీ

నవంబర్‌ 13 2023

దరఖాస్తు విధానం

ఆన్ లైన్

అప్లికేషన్ ఫీజు

జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు రూ.450

అధికారిక వెబ్ సైట్

https://www.mha.gov.in/en

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి