APPSC కీలక నిర్ణయం.. నిరుద్యోగులకు ఇది నిజంగానే శుభవార్త!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగార్థులకు భారీగా ప్రయోజనం చేకూరనున్నది. ఇంతకీ అదేంటంటే?

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగార్థులకు భారీగా ప్రయోజనం చేకూరనున్నది. ఇంతకీ అదేంటంటే?

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ తెలిపింది. గత ఏడాది డిసెంబర్ లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నియామకాల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 899 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే ఈ జాబ్స్ కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 21 2023 నుంచి ప్రారంభమైంది. నేటితో(జనవరి 10 2024) దరఖాస్తు ప్రక్రియ ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 2 దరఖాస్తు గడువు తేదీని పొడిగిస్తూ ఓ ప్రకటనను జారీ చేసింది. ఏపీపీఎస్సీ గ్రూప్-2 దరఖాస్తు గడువు జనవరి 17వ తేదీ అర్ధరాత్రి 11.59 గంటల వరకు పొడిగించింది.

ఉద్యోగార్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ముగింపు గడువులోగా ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ తెలిపింది. ఏపీలో గ్రూప్ 2 ద్వారా 333 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, ఆపై విద్యార్హత కలిగిన వారు గ్రూప్-2 ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న వారు జనవరి 17 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://appsc.aptonline.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

  • గ్రూప్-2 పోస్టులు
  • 899

ఎగ్జిక్యూటివ్ పోస్టులు:

  • 333

నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు:

  • 566

ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలు:

  • మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III: 04 పోస్టులు
  • సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్- II: 16 పోస్టులు
  • డిప్యూటీ తహసీల్దార్: 114 పోస్టులు
  • అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 28 పోస్టులు
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్: 16 పోస్టులు
  • ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్: 02 పోస్టులు
  • ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్‌స్పెక్టర్: 152 పోస్టులు
  • అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 01 పోస్టు

   నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలు:

  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (GAD): 218 పోస్టులు
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా): 15 పోస్టులు
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లెజిస్లేచర్): 15 పోస్టులు
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్): 23 పోస్టులు
  • సీనియర్ ఆడిటర్: 08 పోస్టులు
  • ఆడిటర్: 10 పోస్టులు
  • సీనియర్ అకౌంటెంట్ (కేటగిరీ-1 HOD): 01 పోస్టు
  • సీనియర్ అకౌంటెంట్ (కేటగిరీ-1): 12 పోస్టులు
  • సీనియర్ అకౌంటెంట్: 02 పోస్టులు
  • జూనియర్ అకౌంటెంట్: 22 పోస్టులు
  • జూనియర్ అసిస్టెంట్: 240 పోస్టులు

అర్హతలు:

  • అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా ఆపై అర్హతలున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

  • 01.07.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 21-12-2023.

దరఖాస్తుకు చివరితేది:

  • 17-01-2024.
Show comments