iDreamPost
android-app
ios-app

ESICలో 17,710 ఉద్యోగాలు.. నెలకు రూ. 1.40 లక్షల వరకు జీతం! అర్హతలు ఏంటంటే?

మీరు డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా? మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు ఓ శుభవార్త. ఈఎస్ ఐసీ భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలని కోరింది.

మీరు డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా? మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు ఓ శుభవార్త. ఈఎస్ ఐసీ భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలని కోరింది.

ESICలో 17,710 ఉద్యోగాలు.. నెలకు రూ. 1.40 లక్షల వరకు జీతం! అర్హతలు ఏంటంటే?

చదివిన చదువుకు సార్థకత చేకూరాలంటే దానికి తగిన ఉద్యోగమో లేదా వ్యాపారం చేసినపుడు అది సంపూర్ణమవుతుంది. ఈ క్రమంలో కొందరు బిజినెస్ లను స్థాపించుకుని సొంతంగా ఉపాధి పొందుతున్నారు. మరికొందరు ప్రైవేట్ ఉద్యోగాలు సాధించి సెటిలవుతున్నారు. మిగతా వారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాస్త ఆలస్యమైన సరే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఆ వివరాలు మీకోసం..

ఈఎస్ఐసీ దాదాపు అందరికి తెలిసిన సంస్థనే. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు వైద్య సదుపాయాలను అందిస్తుంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అయితే ఈఎస్ఐలో ఖాళీగా ఉన్న 17710 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 28లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. అభ్యర్థులు పూర్తి వివరాలకు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అధికారిక వెబ్ సైట్ esic.nic.in ను సందర్శించాలని కోరింది.

ముఖ్యమైన సమాచారం:

పోస్టులు

మొత్తం ఖాళీలు 17,710.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్-3341
లోయర్ డివిజన్ క్లర్క్-1923
అప్పర్ డివిజన్ క్లర్క్/అప్పర్ డివిజన్ క్లర్క్ క్యాషియర్-6435
హెడ్ ​​క్లర్క్/అసిస్టెంట్-3415
సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్/ మేనేజర్ గ్రేడ్ II/ సూపరింటెండెంట్- 2596

అర్హతలు

-మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతి లేదా అందుకు సమానమైన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
-అప్పర్, లోయర్, హెడ్ క్లర్క్ పోస్ట్‌లకు గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
-సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లలోపు ఉండాలి

ఎంపిక ప్రక్రియ

సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్, క్లర్క పోస్ట్‌లకు ప్రిలిమ్స్, మెయిన్స్, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్‌లకు ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష ఉంటుంది.

జీతం

లోయర్ డివిజన్ క్లర్క్‌కు జీతం నెలకు రూ.25,500 నుంచి రూ.81,100.. అప్పర్ డివిజన్ క్లర్క్‌కు రూ.19,900 నుంచి రూ.63,200.. మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు రూ.18,000 – రూ.56,900, హెడ్ క్లర్క్ రూ.35,400- రూ.1,12,400, సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ కు రూ.44,900-రూ.1,42,400 మధ్య జీతం లభిస్తుంది.

దరఖాస్తు ఫీజు

ఎస్సీ, ఎస్టీ, పీడబ్య్లూడీ, స్త్రీలు, మాజీ సైనికులు రూ. 250 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా వారు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ

ఆన్ లైన్

అప్లికేషన్ చివరి తేదీ

28-11-2023

అధికారిక వెబ్ సైట్

esic.nic.in

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి