iDreamPost
android-app
ios-app

మళ్లీ రాని అవకాశం.. ఆ శాఖలో 4,356 ఉద్యోగాలు.. నెలకు 1,90,000 జీతం!

ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆ శాఖలో 4356 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరంటే?

ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆ శాఖలో 4356 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరంటే?

మళ్లీ రాని అవకాశం.. ఆ శాఖలో 4,356 ఉద్యోగాలు.. నెలకు 1,90,000 జీతం!

నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదే మంచి అవకాశం. తెలంగాణలోని ఆ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ఏకంగా 4356 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను సాధిస్తే భారీ స్థాయిలో వేతనాలు అందుకోవచ్చు. తెలంగాణలోని 26 ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటి అనుబంధ బోధనాసుపత్రుల్లో 4,356 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్, ట్యూటర్లను భర్తీ చేయనున్నారు.

వీటిల్లో ప్రొఫెసర్ పోస్టులు 498, అసోసియేట్ ప్రొఫెసర్ 786, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1,459, ట్యూటర్లు 412, సీనియర్ రెసిడెంట్ పోస్టులు 1,201 ఉన్నాయి. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న మెడికల్ కాలేజీల్లో మార్చి 16న నిర్వహించే వాక్‌ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

అర్హతలు:

  • ప్రొఫెసర్ పోస్టులకు ఎంబీబీఎస్‌తోపాటు ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ అర్హత ఉండాలి. దీంతోపాటు 8 సంవత్సరాల అనుభవం తప్పనిసరి.
  • అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంబీబీఎస్‌తోపాటు ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ అర్హత ఉండాలి. దీంతోపాటు 5 సంవత్సరాల అనుభవం తప్పనిసరి.
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంబీబీఎస్‌తోపాటు ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ అర్హత ఉండాలి.
  • సీనియర్ రెసిడెంట్ పోస్టులకు ఎంబీబీఎస్‌తోపాటు ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ అర్హత ఉండాలి.
  • ట్యూటర్ పోస్టులకు ఎంబీబీఎస్‌ అర్హత ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 31.03.2024 నాటికి 69 సంవత్సరాలలోపు ఉండాలి.

దరఖాస్తు విధానం:

  • ఆఫ్‌ లైన్

ఎంపిక విధానం:

  • అర్హతలు, అనుభవం, రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,90,000
  • అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,50,000
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,25,000
  • సీనియర్ రెసిడెంట్ పోస్టులకు నెలకు రూ.92,575
  • ట్యూటర్ పోస్టులకు నెలకు రూ.55,000.

వాక్‌ఇన్ ఇంటర్వ్యూ తేదీ:

  • 16-03-2024