P Venkatesh
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని కల్పించింది సీఆర్పీఎఫ్. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ అప్లై చేసుకోండి.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని కల్పించింది సీఆర్పీఎఫ్. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ అప్లై చేసుకోండి.
P Venkatesh
ఈ రోజుల్లో ఉద్యోగం లేదా వ్యాపారం.. ఈ రెండింటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వ్యాపారం అయితే పెట్టుబడి కావాలి. అంతేగాక వ్యాపారంలో నిలదొక్కుకోగలుగుతామా లేదా అనేది ఖచ్చితంగా చెప్పలేము. బిజినెస్ ఎప్పుడైనా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. అదే ప్రభుత్వ ఉద్యోగమైతే నెల తిరిగే సరికల్లా అకౌంట్లో శాలరీ. ప్రశాంతమైన జీవితం. ఇలా సకల సదుపాయాలు ఉంటాయి. కాబట్టి కాస్త ఆలస్యమైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో సన్నద్ధమవుతుంటారు యువతీ యువకులు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్ అందించింది సీఆర్పీఎఫ్. పలు పోస్టుల భర్తీకి రిక్రూట్ మెంట్ ప్రక్రియను ప్రారంభించింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మీరు ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లైతే మీకు ఇదొక సువర్ణావకాశం. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తోంది సీఆర్పీఎఫ్. సీఆర్పీఎఫ్ ఆసుపత్రుల్లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ల భర్తీ కోసం సీఆర్పీఎఫ్ వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మొత్తం 16 పోస్టులను కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేయనున్నది. అయితే ఇంటర్వ్యూ తేదీ నాటికి 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పురుష మరియు మహిళా అభ్యర్థులు ఈ సీఆర్పీఎఫ్ రిక్రూట్‌మెంట్‌కు హాజరు కావచ్చని తెలిపింది. ఈ ఖాళీలు ఛత్తీస్‌గఢ్, అస్సాం, జమ్మూ & కాశ్మీర్, మహారాష్ట్ర మరియు ఒడిశా స్థానాలకు ఉన్నప్పటికీ, నియామకం పొందిన వ్యక్తి దేశంలోని ఏ ప్రాంతంలోనైనా సేవలందించాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులందరూ డిసెంబర్ 4 2023 రోజునాడు ఉదయం 9 గంటల నుంచి సీఆర్పీఎఫ్ సూచించిన ప్రదేశాల్లో హాజరు కావాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://rect.crpf.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరవుతున్నప్పుడు, అభ్యర్థులు పత్రాల ఒరిజినల్ మరియు ఫోటోకాపీలు (డిగ్రీ, వయస్సు రుజువు మరియు అనుభవ ధృవీకరణ పత్రం మొదలైనవి)ఉండాలి. సాదా కాగితంలో దరఖాస్తు, దరఖాస్తు చేసిన పోస్ట్ పేరును పేర్కొనడం మరియు ఐదు తాజా పాస్పోర్ట్ సైజు ఫొటోలను తీసుకురావాలి. ఇంటర్వ్యూల తర్వాత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని సీఆర్పీఎఫ్ తెలిపింది.
ఇంటర్య్వూ జరిగే ప్రదేశాలు.
కాంపోజిట్ హాస్పిటల్, సీఆర్పీఎఫ్, జగదల్పూర్
కాంపోజిట్ హాస్పిటల్, సీఆర్పీఎఫ్, గౌహతి
గ్రూప్ సెంటర్, సీఆర్పీఎఫ్, శ్రీనగర్
కాంపోజిట్ హాస్పిటల్, సీఆర్పీఎఫ్, నాగ్‌పూర్
కాంపోజిట్ హాస్పిటల్, సీఆర్పీఎఫ్, భువనేశ్వర్
అర్హతలు
అభ్యర్థులు ఎంబీబీఎస్ డిగ్రీ మరియు అవసరమైన ఇంటర్న్‌షిప్ అనుభవం కలిగి ఉండాలి.
జీతం
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.75,000 వేతనంగా అందజేస్తారు.
అధికారిక వెబ్ సైట్