P Venkatesh
ECIL Recruitment 2024: బీటెక్ గ్రాడ్యుయేట్స్ కి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలను పొందొచ్చు.
ECIL Recruitment 2024: బీటెక్ గ్రాడ్యుయేట్స్ కి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలను పొందొచ్చు.
P Venkatesh
మీరు బీటెక్ చేసి ఖాళీగా ఉన్నారా? బీటెక్ అర్హతతో ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే బీటెక్ గ్రాడ్యుయేట్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 55 వేల జీతం అందుకోవచ్చు. ప్రైవేట్ సెక్టార్ కంటే ప్రభుత్వ ఉద్యోగాలకే ప్రియారిటీ ఇచ్చే వారికి ఇవి బెస్ట్ జాబ్స్. ప్రైవేట్ లో అయితే జాబ్ సెక్యూరిటీ ఉండదు. ఒత్తిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.
ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) హైదరాబాద్ తో పాటు పలు జోనల్ కార్యాలయాల్లో ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈజీగా జాబ్ సాధించొచ్చు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 115 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. పోస్టులను అనుసరించి 30 నుంచి 33 ఏళ్లు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఆగస్టు 8 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.