sai
AI Airport Services Recruitment 2024: టెన్త్ పాసై ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నవారికి గుడ్ న్యూస్. ఎయిర్ పోర్టులో 3,256 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.
AI Airport Services Recruitment 2024: టెన్త్ పాసై ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నవారికి గుడ్ న్యూస్. ఎయిర్ పోర్టులో 3,256 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.
sai
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. టెన్త్ పాసై ఖాళీగా ఉన్నవారికి గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. పదోతరగతి అర్హతతో ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. టెన్త్ అర్హతతో ఉద్యోగాలు లేవని నిరాశ చెందేవారికి ఇదే మంచి అవకాశం. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి వేతనం అందుకోవచ్చు. తాజాగా ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ 3,256 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ పద్దతిన మూడేళ్ల కాలపరిమితికి ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, డ్రైవింగ్ లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
పోస్టును అనుసరించి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, పర్సనల్/ వర్చువల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టులను బట్టి నెలకు 22 వేల నుంచి 75 వేల వరకు అందుకోవచ్చు. పోస్టులను అనుసరించి అభ్యర్థులు 28 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను జూలై 12, 13, 14, 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కింది ఈ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.