iDreamPost
android-app
ios-app

ఈ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వద్దు.. BOBలో ఉద్యోగాలు.. నెలకు రూ. 78,230 జీతం

మీరు బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. సీనియర్ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రముఖ బ్యాంకు. పూర్తి వివరాలు మీకోసం..

మీరు బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. సీనియర్ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రముఖ బ్యాంకు. పూర్తి వివరాలు మీకోసం..

ఈ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వద్దు.. BOBలో ఉద్యోగాలు.. నెలకు రూ. 78,230 జీతం

లక్షలు లేనోడు పేదోడు కాదు.. లక్ష్యాలు లేనోడు పేదోడు. సరైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని తగిన కృషి చేస్తే.. విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. కావాల్సిందల్లా చేసే పనిపట్ల శ్రద్ధ, అంకితభావం. నేటి రోజుల్లో విద్యా, ఉద్యోగాలకు ప్రాధాన్యత పెరిగింది. ఏటా వేల మంది డిగ్రీ పట్టాలు పుచ్చుకుని బయటకు వస్తున్నారు. ఉద్యోగాలకు కాంపిటీషన్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. మరి ఇంతటి పోటీని తట్టుకుని మీరు ఉద్యోగం సాధించాలంటే ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. ప్రముఖ బ్యాంకు పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే ఏకంగా రూ. 78,230 జీతాన్ని అందుకోవచ్చు. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి, బ్యాంకు ఉద్యోగాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న వారికి శుభవార్త. ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంఎస్‌ఎంఈ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 250 సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ లేదా పీజీ అర్హతతోపాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకునేందుకు చివరి తేదీ డిసెంబర్ 26గా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్ సైట్ https://www.bankofbaroda.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

పోస్టుల వివరాలు:

  • సీనియర్ మేనేజర్ పోస్టులు

మొత్తం ఉద్యోగాలు:

  • 250

విభాగం:

  • ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్‌ – ఎంఎంజీ/ఎస్‌-III.

విద్యార్హత:

  • కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ/ ఎంబీఏ(మార్కెటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • 01.12.2023 నాటికి 28 – 37 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

అప్లికేషన్ ఫీజు:

  • జనరల్, ఈడబ్య్లూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్

ఎంపిక విధానం:

  • ఆన్‌లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష, ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.63,840 – రూ.78,230 వరకు చెల్లిస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 06-12-2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది:

  • 26-12-2023.

బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్ సైట్:

https://www.bankofbaroda.in/

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి