P Venkatesh
ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే అవకాశం వచ్చింది. ఏకంగా 9749 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. వెంటనే అప్లై చేసుకోండి.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే అవకాశం వచ్చింది. ఏకంగా 9749 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. వెంటనే అప్లై చేసుకోండి.
P Venkatesh
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. వందల్లో కాదు ఏకంగా 9,749 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో దరఖాస్తుల గడువు ముగియనున్నది. మీరు టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత ఉన్నట్లైతే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి వారికైనా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే వేలు, లక్షల్లో జీతాలు అందుకోవచ్చు. రైల్వే డిపార్ట్ మెంట్, నవోదయ విద్యాలయాలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కలిపి 9,749 ప్రభుత్వ ఉద్యోగాలకు భర్తీకానున్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ముంచుకొస్తుంది.
దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 3,712 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు 12వ తరగతి/ ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారు అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. మే 7 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థుల వయసు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి. ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్టులకు రూ.19,900-63,200. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రూ.25,500-81,100. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-ఏ పోస్టులకు రూ.29,200-92,300 వేతనం అందిస్తారు. అప్లికేషన్ ఫీజు రూ.100 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.
దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల హెడ్‌క్వార్టర్స్‌లలో, నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో 1,337 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రకటించిన పోస్టుల్లో హెడ్‌క్వార్టర్స్‌లలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులను, నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో స్టాఫ్ నర్స్(ఉమెన్), కేటరింగ్ సూపర్‌వైజర్, జూనియర్ సెక్రటేరియట్అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ పోస్టులను భర్తీచేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే 7 దరఖాస్తులకు చివరితేది.
పోస్టులను అనుసరించి టెన్త్, ఇంటర్, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. పోస్టులను అనుసరించి అభ్యర్థులు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే పోస్టులను బట్టి నెలకు రూ. 18000 నుంచి 1,42,400వరకు అందుకోవచ్చు. దరఖాస్తు ఫీజు జనరల్/ ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500(ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు), రూ.1000 (ఇతర పోస్టులకు).. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
భారీ ఎత్తున్న ఉద్యోగాలు భర్తీ చేసే శాఖల్లో రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఒకటి. భారతీయ.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్ఫఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్‌లో ఖాళీగా ఉన్న 4,660 ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 4,208 కానిస్టేబుల్, 452 ఎస్సై ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 15 నుంచి మే 14వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి; ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి.
అభ్యర్థులకు నిర్దిష్టమైన శారీరక ప్రమాణాలు అవసరం. 2024 జులై 1 నాటికి కానిస్టేబుల్ అభ్యర్థుల వయస్సు 18-28 ఏళ్లు, ఎస్సై అభ్యర్థులకు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా వర్గాల వారీగా వయో సడలింపు ఇస్తారు. ఎస్సై పోస్టులకు రూ.35,400, కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700 చొప్పున ప్రారంభ వేతనంగా ఇస్తారు. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్/మహిళలు/ ట్రాన్స్‌జెండర్/ మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500. పరీక్షకు హాజరైతే రూ.400 రిఫండ్ వస్తుంది.