ITI, డిప్లొమా పాసయ్యారా? సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 2,528 జాబ్స్ రెడీ

RRB Assistant Loco Pilot Notification 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వేలో జాబ్ కోసం ఎదురుచూసే వారికి ఇదే మంచి ఛాన్స్. సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 2,528 జాబ్స్ భర్తీకానున్నాయి.

RRB Assistant Loco Pilot Notification 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వేలో జాబ్ కోసం ఎదురుచూసే వారికి ఇదే మంచి ఛాన్స్. సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 2,528 జాబ్స్ భర్తీకానున్నాయి.

ఆసియాలో రెండో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశం భారత్. భారతీయ రైల్వే నిత్యం వేలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ ప్రజాధారణ పొందింది. రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. భద్రతా పరమైన చర్యలు, అవసరానికి సరిపడ సిబ్బందిని నియామకాల కోసం చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో భారతీయ రైల్వే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. 18,799 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అవుతున్నది. ఈ పోస్టుల్లో సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 2,528 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ జాబ్స్ ఉన్నాయి.

రైల్వే శాఖ జనవరిలో వివిధ రైల్వే జోన్ లలో 5,696 అసిస్టెంట్ లోకోపైలట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ పోస్టులను భారీగా పెంచుతూ రైల్వే శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాజా ప్రకటన ప్రకారం మొత్తం 18,799 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ మేరకు జోన్ల వారీగా ఖాళీల వివరాలు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలో ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు ఆర్‌ఆర్‌బీ స్పష్టం చేసింది. అభ్యర్థులు దీనికి సంబంధించిన సమాచారం కోసం రైల్వే శాఖ అధికారిక వెబ్ సైట్ ను పరిశీలించాలని కోరింది.

అసిస్టెంట్‌ లోకో పైలట్‌ జాబ్స్ కోసం పోటీపడే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఏఐసీటీఈ గుర్తింపు విద్యాసంస్థ నుంచి ఇంజినీరింగ్‌ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఫస్ట్‌ స్టేజ్‌ సీబీటీ-1, సెకండ్‌ స్టేజ్‌ సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు జీతం ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Show comments