iDreamPost
android-app
ios-app

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. వైద్య శాఖలో 2 వేల 867డాక్టర్ ఉద్యోగాలు

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. త్వరలో వైద్య శాఖలో 2 వేల 867డాక్టర్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నాయి.

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. త్వరలో వైద్య శాఖలో 2 వేల 867డాక్టర్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నాయి.

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. వైద్య శాఖలో 2 వేల 867డాక్టర్ ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దృష్టిసారించింది. ఇప్పటికే పలు జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ అవ్వగా వాటికి సంబంధించిన భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీల్లో భాగంగా జాబ్స్ ను భర్తీ చేసేందుకు రెడీ అవుతోంది. గ్రూప్ 1,2,3 తో పాటు మెగా డీఎస్సీ ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ఈ క్రమంలో మరో గుడ్ న్యూస్ అందించింది. వైద్యారోగ్య శాఖలో భారీగా డాక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నది. త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.

ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జులై చివరికల్లా రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టుగా సమాచారం. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం అవసరమైన సిబ్బందిని నియమిచేందుకు రెడీ అవుతున్నది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ) ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నారు. మొత్తం 2,867 పోస్టుల భర్తీకి ఈ నెలలోనే దశలవారీగా మొత్తం 4 నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 664 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 18న తొలి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలు, ఇతర దవాఖాన్లలో ఖాళీగా ఉన్న 443 సివిల్ అసిస్టెంట్ సర్జన్(ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) పోస్టులకు ఈ నెల 20న నోటిఫికేషన్, వైద్య విధాన పరిషత్ పరిధిలోని దవాఖాన్లలో ఖాళీగా ఉన్న 1,690 సివిల్ అసిస్టెంట్ సర్జన్(స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) పోస్టుల భర్తీకి ఈ నెల 25న నోటిఫికేషన్, ఆయుష్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 70 ఆయుష్ లెక్చరర్ పోస్టులకు ఈ నెల 27న నోటిఫికేషన్స్ వెలువడనున్నాయని సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్ల పోస్టులు 531 భ‌ర్తీ చేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఈ పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవ‌ల నియామ‌క బోర్డు త్వర‌లోనే నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది. అదేవిధంగా 193 ల్యాబ్ టెక్నీషియ‌న్ పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్ త్వర‌లోనే నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది. అలాగే, వివిధ ఆసుప‌త్రుల్లో రోగుల‌కు సేవ‌లు అందించే స్టాఫ్ న‌ర్సుల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు 31 స్టాఫ్ న‌ర్సుల పోస్టుల భ‌ర్తీకి ఎంహెచ్ఎస్ ఆర్‌బీ నోటిఫికేష‌న్ జారీ చేయనున్నది.