WPL కప్ గెలిచిన RCB ఉమెన్స్ టీమ్ కి దక్కిన ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? ఇంత తక్కువా?

WPL కప్ గెలిచిన RCB ఉమెన్స్ టీమ్ కి దక్కిన ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? పురుషుల ప్రైజ్ మనీతో పోలిస్తే.. ఇది ఎంత తక్కువో తెలుసా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

WPL కప్ గెలిచిన RCB ఉమెన్స్ టీమ్ కి దక్కిన ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? పురుషుల ప్రైజ్ మనీతో పోలిస్తే.. ఇది ఎంత తక్కువో తెలుసా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, స్మృతి మంధాన, ఎల్లీస్ పెర్రీ.. ప్రస్తుతం ఈ పేర్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తన అందంతో పాటుగా ఆటతో ప్రేక్షకులను ఉర్రూతలుగించడమే కాకుండా.. ఆర్సీబీ టీమ్ కు తొలి కప్ ను అందించడంలో కీలక పాత్ర పోషించింది పెర్రీ. ఇక తన అద్భుతమైన కెప్టెన్సీతో జట్టును ముందుండి నడిపించిది లేడీ కోహ్లీ స్మృతి మంధాన. టోర్నీలో ఆరంభం నుంచి ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. ఫైనల్లో మాత్రం అద్భుతంగా రాణించి, 8 వికెట్ల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. అయితే WPL కప్ గెలిచిన RCB ఉమెన్స్ టీమ్ కి దక్కిన ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? పురుషుల ప్రైజ్ మనీతో పోలిస్తే.. ఇది ఎంత తక్కువో తెలుసా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

16 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్, యాజమాన్యం కలను ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 టైటిల్ ను దక్కించుకోవడం ద్వారా నెరవేర్చారు ఆర్సీబీ ఉమెన్స్. అరుణ్ జైట్లీ వేదికగా జరిగిన టైటిల్ పోరులో గతేడాది రన్నరప్ జట్టు అయిన ఢిల్లీ క్యాపిటల్స్ ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో తొలిసారి కప్ ను కైవసం చేసుకుంది ఆర్సీబీ. ఇక ఈ విజయంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. నగరంలో భారీగా ర్యాలీలు, డీజే పాటలతో తమ సంతోషాన్ని తెలియపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో WPL టైటిల్ గెలిచిన ఆర్సీబీకి ఎంత ప్రైజ్ మనీ వస్తుంది? అని ఆరాతీయడం మెుదలుపెట్టారు నెటిజన్లు.

ఈ క్రమంలో వారికి దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి. టైటిల్ గెలిచిన ఉమెన్స్ టీమ్ కు ఇంత తక్కువ డబ్బులా వచ్చేది.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. డబ్ల్యూపీఎల్ విజేత అయిన ఆర్సీబీకి రూ. 6 కోట్ల ప్రైజ్ మనీ లభించగా, రన్నరప్ గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కు రూ. 3 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. దీంతో ఈ విషయం తెలిసి అభిమానులు షాక్ కు గురవుతున్నారు. మరీ ఇంత పార్శియాలిటి ఏంటి? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అదే పురుషుల విషయానికి వస్తే.. ఐపీఎల్ 2023 విన్నింగ్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ కు రూ. 20 కోట్లు, రన్నరప్ గా నిలిచిన గుజరాత్ కు రూ. 13 కోట్లు దక్కాయి.

ఇక ఈ సంవత్సం ఐపీఎల్ విజేతగా నిలిచే టీమ్ కు మునపటి కంటే ఎక్కువగా ముట్టే ఛాన్స్ ఉంది. రూ. 6 కోట్లు ఎక్కడ? 20 కోట్లు ఎక్కడ? రెండింటికీ పొంతనే లేదు అంటూ సగటు క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ విషయంపై బీసీసీఐ ఒకసారి ఆలోచించాలని వారు సూచిస్తున్నారు. ఇక మిగతా వారికి దక్కిన ప్రైజ్ మనీలు చూస్తే.. అత్యధిక పరుగులు చేసిన ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచిన ఎల్లీస్ పెర్రీకి రూ. 5 లక్షలు, అత్యధిక వికెట్లు తీసి పర్పులు క్యాప్ దక్కించుకున్న శ్రేయాంక పాటిల్ కు రూ. 5 లక్షలు దక్కాయి. పురుషుల ప్రైజ్ మనీకి, ఉమెన్స్ ప్రైజ్ మనీకి మధ్య ఉన్న తేడాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: RCB ఫ్యాన్స్.. 16 ఏళ్ల కల తీర్చిన దేవత ఎల్లీస్ పెర్రీ కథ!

Show comments