iDreamPost

RCB ఫ్యాన్స్.. 16 ఏళ్ల కల తీర్చిన దేవత ఎల్లీస్ పెర్రీ కథ!

16 సంవత్సరాలుగా అర్రులుచాచి, ఒకే ఒక్క కప్ కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్ కలను నెరవేర్చిన దేవత ఎల్లీస్ పెర్రీ. విరాట్ కోహ్లీ, ఏబీడీ, క్రిస్ గేల్ లాంటి దిగ్గజాలు సాధించలేనిది సాధించి పెట్టిన ఎల్లీస్ పెర్రీ అనే ఓ దేవత కథ ఇది. పదండి ఓసారి పరిశీలిద్దాం.

16 సంవత్సరాలుగా అర్రులుచాచి, ఒకే ఒక్క కప్ కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్ కలను నెరవేర్చిన దేవత ఎల్లీస్ పెర్రీ. విరాట్ కోహ్లీ, ఏబీడీ, క్రిస్ గేల్ లాంటి దిగ్గజాలు సాధించలేనిది సాధించి పెట్టిన ఎల్లీస్ పెర్రీ అనే ఓ దేవత కథ ఇది. పదండి ఓసారి పరిశీలిద్దాం.

RCB ఫ్యాన్స్.. 16 ఏళ్ల కల తీర్చిన దేవత ఎల్లీస్ పెర్రీ కథ!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఇదొక పేరు కాదు, జట్టు కాదు.. ఓ ఎమోషన్. ఆర్సీబీ అంటే ఫ్యాన్స్ పడిచచ్చిపోతారు. ఇంత అభిమానానికి కారణం ఏంటి? అంటే ఏం చెబుతాం. అదొక వర్ణించలేని ప్రేమ. అయితే వీరి ప్రేమ కప్ కొడితేనో, లేక మ్యాచ్ గెలిస్తేనో ఉండేది కాదు. గత 16 సంవత్సరాలుగా ఐపీఎల్ టైటిల్ గెలవకున్నా.. రోజు రోజుకు ఆర్సీబీపై అభిమానం పెరుగుతూ వస్తోంది తప్ప తగ్గడం లేదు. మరి ఇంతలా పిచ్చి ప్రేమను పెంచుకున్న ఆర్సీబీకి 16 ఏళ్లుగా ఓ కల అలాగే మిగిలిపోయింది. అదే ఆర్సీబీకి ఓ కప్. ఆ కలను తాజాగా నెరవేర్చింది ఆస్ట్రేలియాకు చెందిన ఓ దేవత. ఆ ఏంజెల్ పేరే ‘ఎల్లీస్ అలెగ్జాండ్రా పెర్రీ’. అభిమానులు ముద్దుగా బ్యూటీ విత్ టాలెంట్ అని పిలుచుకుంటారు. కోహ్లీ, ఏబీడీ, గేల్ సాధించలేని సుదీర్ఘ స్వప్నాన్ని ఒంటిచేత్తో సాధించింది పెర్రీ. మరి ఆర్సీబీ కల నెరవేర్చిన ఎల్లీస్ పెర్రీ కథేంటో ఓసారి పరిశీలిద్దాం పదండి.

ఎల్లీస్ అలెగ్జాండ్రా పెర్రీ.. నవంబర్ 3, 1990న ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రాంతంలో జన్మించింది. అయితే పుట్టుకతోనే ఆటను అవపోసన పట్టినట్లుంది ఈ భామ. చిన్నతనం నుంచే క్రికెట్ తో పాటుగా ఫుట్ బాల్ క్రీడలో రాణించింది. 16 సంవత్సరాల పిన్న వయసులోనే పెర్రీ జాతీయ క్రికెట్ టీమ్ తో పాటుగా సాకర్ జట్టులోకి అరంగేట్రం చేసి అందరికి షాకిచ్చింది. కానీ 2014 నుంచి క్రికెట్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అప్పటి నుంచి క్రికెట్ కు ఓ అందం దొరికిందని అభిమానులు సంబరపడిపోయారు. పెర్రీ మ్యాచ్ ఆడుతుందంటే చాలు స్టేడియాలు నిండిపోయేవి.

The story of 16-year-old goddess Ellie Perry who fulfilled her dream!

బిగ్ బాష్ లీగ్, హండ్రెడ్ లీగ్ లతో పాటుగా ఆస్ట్రేలియా క్రికెట్ లో స్టార్ క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే నిఖార్సైన ఆల్ రౌండర్ గా వరల్డ్ వైడ్ గా మన్ననలు పొందింది. ఇక ఆమె ఆటను చూసి.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ప్రారంభ సీజన్ లో రూ. 1.7 కోట్లకు దక్కించుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్. గంటకు 115 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడమే కాకుండా.. ధాటిగా బ్యాటింగ్ చేయడంలో పెర్రీ దిట్ట. ప్రస్తుతం ఎల్లీస్ పెర్రీ ప్రపంచ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 టైటిల్ ను ఒంటిచేత్తో ఆర్సీబీకి అందించడమే.

16 సంవత్సరాలుగా ఒకే ఒక్క కప్ కోసం నిరీక్షిస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్ కలను నెరవేర్చిన దేవత ఎల్లీస్ పెర్రీ. ఆర్సీబీ కి చెందిన దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి క్రికెటర్లు సాధించలేని పెర్రీ సాధించిపెట్టింది. దీంతో ఆర్సీబీ పాలిట దేవతగా ఆమెను అభివర్ణిస్తున్నారు ఫ్యాన్స్. ఈ లీగ్ లో అద్భుతమైన ప్రదర్శనతో తిరుగులేని బ్యాటర్ గా నిలిచింది. ఆరెంజ్ క్యాప్ ను దక్కించుకుంటూ.. మెుత్తం 9 మ్యాచ్ ల్లో 69.40 యావరేజ్ తో 347 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. ఇందులో రెండు అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి.

The story of 16-year-old goddess Ellie Perry who fulfilled her dream! 3

అదీకాక లీగ్ చరిత్రలోనే ఒకే మ్యాచ్ లో 6 వికెట్లు తీసుకున్న తొలి ప్లేయర్ గా రికార్డు నెలకొల్పింది. బ్యాటింగ్ తో పాటుగా బౌలింగ్ లోనూ రాణించి.. 16 ఏళ్లుగా ఆర్సీబీ ఫ్యాన్స్ అర్రులుచాచి ఎదురుచూస్తున్న వారి కలను నెరవేర్చింది. దీంతో తమ అభిమాన టీమ్ కు తొలి కప్ అందించిన పెర్రీని దేవతగా చూస్తున్నారు ఫ్యాన్స్. ఇక పెర్రీ వ్యక్తిగత విషయాల్లోకి వస్తే.. 2015లో ఆస్ట్రేలియా రగ్బీ ప్లేయర్ మాట్ టోమువా ను పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ జంట 2020లో విడిపోయారు. కాగా.. పెర్రీ కెరీర్ లో 13 టెస్టులు, 144 వన్డేలు, 145 టీ20లకు ఆస్ట్రేలియా తరఫున ప్రాతినిథ్యం వహించింది. మరి ఆర్సీబీ ఫ్యాన్స్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి, వారి దేవతగా మారిన ఎల్లీస్ పెర్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: WPL టైటిల్ విన్నింగ్.. లేడీ కోహ్లీకి గ్రౌండ్ లోనే సర్ ప్రైజ్ ఇచ్చిన విరాట్! వీడియో వైరల్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి