Nidhan
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంకా ఆ బాధలో నుంచి బయటకు రాలేదు. తన పెయిన్‌ను పాత స్నేహితుడు, సీనియర్ గౌతం గంభీర్‌తో కలసి షేర్ చేసుకున్నాడు కింగ్.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంకా ఆ బాధలో నుంచి బయటకు రాలేదు. తన పెయిన్‌ను పాత స్నేహితుడు, సీనియర్ గౌతం గంభీర్‌తో కలసి షేర్ చేసుకున్నాడు కింగ్.
Nidhan
ఐపీఎల్లో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్‌లో విరాట్ కోహ్లీ-గౌతం గంభీర్‌ది ఒకటి. వీళ్లిద్దరూ టీమిండియా తరఫున చాలా కాలం కలసి ఆడారు. వీళ్ల డొమెస్టిక్ టీమ్ (ఢిల్లీ) కూడా ఒకటే. వన్డే వరల్డ్ కప్-2011 ఫైనల్లో భారత జట్టు విజయంలో వీళ్ల పార్ట్నర్షిప్ చాలా కీలకపాత్ర పోషించింది. 31 పరుగులకే 2 వికెట్లు పడి కష్టాల్లో పడ్డ టీమ్‌ను కోహ్లీ-గంభీర్ ఆదుకున్నారు. ఇద్దరూ కలసి మూడో వికెట్‌కు 83 పరుగులు జోడించారు. అయితే ఇంత మంచి బాండింగ్ ఉన్న వీళ్లు ఐపీఎల్ వల్ల శత్రువులుగా మారారు. గతేడాది ఆర్సీబీ-లక్నో మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ-గౌతీ ఒకరి మీదకు ఒకరు దూసుకెళ్లడం తెలిసిందే. అయితే వీళ్ల గొడవకు ఈ సీజన్‌తో ఫుల్స్టాప్ పడింది. మళ్లీ క్లోజ్ అయిన ఈ లెజెండ్స్ మధ్య ఓ ఆసక్తికర సంభాషణ జరిగింది.
గంభీర్-కోహ్లీ మళ్లీ కలసిపోయిన సంగతి తెలిసిందే. అయితే వీళ్లిద్దరి మధ్య ఓ ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ నడించింది. ఇందులో పాత గాయాన్ని రేపడం ఆసక్తికరంగా మారింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌కు ఆర్సీబీ రెడీ అయిపోయింది. కోల్‌కతా వేదికగా ఇవాళ ఈ మ్యాచ్ జరగనుంది. దీంతో ఈడెన్ గార్డెన్స్‌కు చేరుకున్న డుప్లెసిస్ సేన ప్రాక్టీస్‌లో మునిగిపోయింది. ఈ సందర్భంగా కేకేఆర్ మెంటార్ గంభీర్‌ను కలిశాడు కోహ్లీ. అతడితో చాలా సేపు ముచ్చటించాడు. ఇద్దరూ నవ్వుతూ తిరిగి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అయితే ఒకేసారి అక్కడ వాతావరణం వేడెక్కింది. దీనికి కారణం వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్లో భారత్ ఓటమిని కోహ్లీ గుర్తుచేయడమే. ఆ మ్యాచ్‌లో తాను ఎలా ఔట్ అయ్యాడో గౌతీకి వివరించాడు కింగ్.
ప్రపంచ కప్ ఓటమి బాధలో నుంచి ఇంకా బయటపడని కోహ్లీ.. ఆ మ్యాచ్‌లో ఎలా ఔట్ అయ్యాడో ఇంకోసారి గుర్తుచేసుకున్నాడు. కమిన్స్ బౌలింగ్‌లో బాల్‌ను డిఫెన్స్ చేయబోయి ఎడ్జ్ అవడంతో క్లీన్ బౌల్డ్ కావడంతో ఆ రోజు కోహ్లీతో పాటు కోట్లాది అభిమానుల హృదయాలు ముక్కలు అయ్యాయి. ఆ డిస్మిసల్ గురించే తాజాగా గంభీర్‌తో డిస్కస్ చేశాడు కోహ్లీ. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ విరాట్.. ఆ చేదు జ్ఞాపకాలను గుర్తు చేయొద్దని, పాత గాయం నుంచి బయటపడి టీ20 వరల్డ్ కప్ కోసం రెడీ అవ్వమని కామెంట్స్ చేస్తున్నారు. ఆ మ్యాచ్‌ను గుర్తుచేసి తమ హార్ట్‌ను మళ్లీ బ్రేక్ చేయొద్దని కోరుతున్నారు. మరి.. వరల్డ్ కప్ మిగిల్చిన బాధ నుంచి కోహ్లీ ఇంకా బయటపడకపోవడం మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Virat Kohli talking about the World Cup Final’s dismissal with Gautam Gambhir. 🥲💔pic.twitter.com/tmqinYVOcj
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 20, 2024
Itni jaldi edit 😭 pic.twitter.com/WJREXL2yXU
— Rishi (@EpicVirat) April 20, 2024