iDreamPost

Rohit Sharma: DCలో రోహిత్​ను రాజులా చూసుకున్న ఈ రాణి ఎవరంటే? బాండింగ్ వేరే లెవల్!

  • Published Apr 20, 2024 | 7:23 PMUpdated Apr 20, 2024 | 7:23 PM

రోహిత్ శర్మ ఐపీఎల్​లో ఒకప్పుడు డెక్కన్ ఛార్జర్స్​కు ఆడేవాడు అనేది తెలిసిందే. అయితే డీసీలో ఉన్నప్పుడు అతడ్ని రాజులా చూసుకుందో బ్యూటీ. వాళ్లది నెక్స్ట్ లెవల్ బాండింగ్ అని చెప్పక తప్పదు.

రోహిత్ శర్మ ఐపీఎల్​లో ఒకప్పుడు డెక్కన్ ఛార్జర్స్​కు ఆడేవాడు అనేది తెలిసిందే. అయితే డీసీలో ఉన్నప్పుడు అతడ్ని రాజులా చూసుకుందో బ్యూటీ. వాళ్లది నెక్స్ట్ లెవల్ బాండింగ్ అని చెప్పక తప్పదు.

  • Published Apr 20, 2024 | 7:23 PMUpdated Apr 20, 2024 | 7:23 PM
Rohit Sharma: DCలో రోహిత్​ను రాజులా చూసుకున్న ఈ రాణి ఎవరంటే? బాండింగ్ వేరే లెవల్!

రోహిత్ శర్మ అంటే చాలు ఐపీఎల్ అభిమానులకు ముందుగా గుర్తుకొచ్చేది ముంబై ఇండియన్సే. ఆ టీమ్​కు కెప్టెన్​గా ఉంటూ 5 సార్లు టైటిల్​ను అందించాడు హిట్​మ్యాన్. ముంబై సారథిగా సక్సెస్​ అవడంతో ఆ తర్వాత కాలంలో భారత జట్టు కెప్టెన్​గానూ అతడికి అవకాశం వచ్చింది. ఇప్పుడు టీమిండియా కెప్టెన్​గా రాణిస్తున్న రోహిత్.. ఐపీఎల్​లో మాత్రం కేవలం ప్లేయర్​గానే ఆడుతున్నాడు. ముంబైకి కొత్త కెప్టెన్​గా హార్దిక్​ పాండ్యాను నియమించడంతో హిట్​మ్యాన్​ బ్యాటర్​గానే కంటిన్యూ అవుతున్నాడు. అయితే అతడు ఒకప్పుడు డెక్కన్ ఛార్జర్స్​కు ఆడాడనే సంగతి తెలిసిందే. ఆ టీమ్​తో తనకు ఉన్న అనుబంధాన్ని ఇటీవల షేర్ చేసుకున్నాడు కూడా. డీసీలో ఉన్నప్పుడు రోహిత్​ను రాజులా చూసుకుంది ఓ బ్యూటీ. ఆమె ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం..

2008లో జరిగిన ఫస్ట్ సీజన్ నుంచి మూడేళ్ల పాటు డెక్కన్ ఛార్జర్స్​కు ప్రాతినిధ్యం వహించాడు రోహిత్. అతడి కెరీర్ స్టార్టింగ్ డేస్ అవి. అప్పట్లో హిట్​మ్యాన్​కు అంత క్రేజ్ లేదు. ఒకవైపు ఆఫ్​ స్పిన్​తో వికెట్లు తీస్తూ, మరోవైపు బ్యాట్​తోనూ చెలరేగుతూ తన సత్తా చాటాడు. ఫీల్డింగ్​లోనూ మెరుస్తూ టీమ్​లో కీలక ప్లేయర్​గా మారాడు. అయితే గిల్​క్రిస్ట్, సైమండ్స్, గిబ్స్ లాంటి దిగ్గజాల నడుమ అనామకుడిగా ఉండేవాడు. ఆ టైమ్​లో అతడ్ని ఓ బ్యూటీ రాజులా చూసుకుంది. ఆమెనే డీసీ ఓనర్ టీ వెంకట్రామ్ రెడ్డి కూతురు గాయత్రి రెడ్డి. అప్పట్లో రోహిత్-గాయత్రికి మధ్య మంచి బాండింగ్ ఉండేది. ఇద్దరూ తక్కువ సమయంలోనే క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు.

డెక్కన్ ఛార్జర్స్ మ్యాచ్​లు చూసేందుకు స్టేడియానికి గాయత్రి తరచూ వచ్చేది. ఆ టైమ్​లో మ్యాచ్ తర్వాత గాయత్రితో గ్రౌండ్​లో సరదాగా మాట్లాడుతూ కనిపించేవాడు రోహిత్. అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆమె బాగా ఎంకరేజ్ చేసేది. ఒకసారి ప్యాడ్స్ వేసుకొని గ్రౌండ్​లో క్రికెట్​ కూడా ఆడింది గాయత్రి. ఇలా హిట్​మ్యాన్​తో ఆమె అనుబంధం అప్పట్లో హైలైట్​గా మారింది. పెద్దగా క్రేజ్ లేని రోహిత్​లో ఫ్యూచర్ స్టార్​ను చూసిన గాయత్రి అతడ్ని బాగా ప్రోత్సహించింది. ఫ్రాంచైజీలో ఉన్నప్పుడు అతడికి అన్ని విషయాల్లోనూ సపోర్ట్​గా ఉంది. అయితే ఆ తర్వాత ముంబై నుంచి ఆఫర్ రావడంతో రోహిత్ ఆ టీమ్​కు వెళ్లిపోయాడు. అలా వీళ్ల మధ్య బాండింగ్​కు బ్రేక్ పడింది. కాగా, ఇటీవల గిల్​క్రిస్ట్​తో చిట్​చాట్ సందర్భంగా డీసీ థీమ్ సాంగ్ తనకు చాలా ఇష్టమని రోహిత్ అన్నాడు. దీన్ని మించినది మరొకటి లేదన్నాడు. ఆ కామెంట్స్​ను గాయత్రి తన ఇన్​స్టా స్టోరీస్​లో పంచుకోవడం విశేషం.

 

View this post on Instagram

 

A post shared by Bobby 🇮🇳 (@rohitianbobby45)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి