iDreamPost
android-app
ios-app

రోహిత్, విరాట్ కోరినా కోచ్​గా ఉండనంటున్న ద్రవిడ్! కారణం అదేనా..?

  • Published May 15, 2024 | 5:54 PM Updated Updated May 15, 2024 | 5:54 PM

టీమిండియా హెడ్ కోచ్ పదవికి బీసీసీఐ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కోచ్ ద్రవిడ్ పదవీకాలం పూర్తవడంతో కొత్త కోచ్​ కోసం వెతుకులాట మొదలుపెట్టింది భారత క్రికెట్ బోర్డు. అసలు ద్రవిడ్​కు మరికొన్నాళ్లు కోచ్​గా కొనసాగే ఛాన్స్ ఉన్నా ఎందుకు అలా చేయలేదనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

టీమిండియా హెడ్ కోచ్ పదవికి బీసీసీఐ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కోచ్ ద్రవిడ్ పదవీకాలం పూర్తవడంతో కొత్త కోచ్​ కోసం వెతుకులాట మొదలుపెట్టింది భారత క్రికెట్ బోర్డు. అసలు ద్రవిడ్​కు మరికొన్నాళ్లు కోచ్​గా కొనసాగే ఛాన్స్ ఉన్నా ఎందుకు అలా చేయలేదనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

  • Published May 15, 2024 | 5:54 PMUpdated May 15, 2024 | 5:54 PM
రోహిత్, విరాట్ కోరినా కోచ్​గా ఉండనంటున్న ద్రవిడ్! కారణం అదేనా..?

టీమిండియా హెడ్ కోచ్ పదవికి బీసీసీఐ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తవడంతో కొత్త కోచ్​ కోసం వెతుకులాట మొదలుపెట్టింది భారత క్రికెట్ బోర్డు. డిసెంబర్ 2021లో కోచ్​గా బాధ్యతలు తీసుకున్న ద్రవిడ్.. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్-2023 ముగిశాక వైదొలగాలని అనుకున్నాడు. తన పదవీకాలం పూర్తవడంతో తప్పుకోవాలని భావించాడు. కానీ టీ20 వరల్డ్ కప్​కు ఎక్కువ సమయం లేకపోవడంతో అప్పటిదాకా కొనసాగమని బీసీసీఐ కోరడంతో కాదనలేకపోయాడు. అయితే ఇప్పుడు పొట్టి కప్పుకు టైమ్ దగ్గర పడుతుండటంతో తన కాంట్రాక్ట్ గురించి బోర్డు దగ్గర తేల్చి చెప్పేశాడు. తన స్థానంలో మరొకర్ని తీసుకోమని చెప్పాడు. దీంతో చేసేదేమీ లేక కోచ్ పదవికి ప్రకటనను విడుదల చేసింది బోర్డు.

కోచ్ పదవిలో మరికొన్నాళ్లు కొనసాగే ఛాన్స్ ఉన్నా ద్రవిడ్ ఎందుకు బోర్డు ఆఫర్​ను తిరస్కరించాడనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇంకో ఏడాది పాటు టీమ్​తో ట్రావెల్ చేయమంటూ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్టార్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రా, ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా లాంటి సీనియర్ ఆటగాళ్లు ద్రవిడ్​ను కోరారట. కానీ అతడు మాత్రం వాళ్ల విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తోంది. సీనియర్లు కోరినా ద్రవిడ్ అలా చేయడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. హెడ్ కోచ్ పదవి చాలా బాధ్యతతో కూడుకున్నది. అందునా ఎంతో క్రేజ్ ఉన్న టీమిండియాకు కోచ్​గా ఉండటం అంటే ఎంతో సవాళ్లతో కూడుకున్న రోల్. మూడు ఫార్మాట్లలోనూ జట్టు గెలుపోటములకు కోచ్​దే రెస్పాన్సిబిలిటీ.

టీమ్ గెలిస్తే ప్రశంసలు దక్కడం పక్కనబెడితే.. ఓడితే మాత్రం భారత క్రికెట్ బోర్డుకు, మీడియాకు, ఫ్యాన్స్​కు కోచ్​ వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కెప్టెన్ తర్వాత అంత ప్రెజర్ తీసుకోవాల్సింది హెడ్ కోచే. ఇప్పటికే రెండున్నరేళ్లు ఆ పదవిలో కొనసాగాడు ద్రవిడ్. వన్డే వరల్డ్ కప్-2023 ముగిసిన తర్వాత వెళ్లిపోతానంటే బతిమిలాడి కంటిన్యూ చేయించారు. ఈ పోస్ట్ వల్ల ఫ్యామిలీతో టైమ్ గడపడానికి వీలు కుదరడం లేదు. హై ప్రెజర్, కుటుంబంతో గడపలేకపోవడం వంటి పలు వ్యక్తిగత కారణాల వల్లే రోహిత్, కోహ్లీ వంటి సీనియర్లు కోరినా ద్రవిడ్ కొనసాగడానికి ససేమిరా అన్నాడని సమాచారం. మరి.. ద్రవిడ్ వారసుడిగా ఎవరు వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.