iDreamPost
android-app
ios-app

Virat Kohli: వరల్డ్ కప్​ కొట్టాలంటే కోహ్లీని ఆ పొజిషన్​లో ఆడించాలి.. రోహిత్​కు గంగూలీ సూచన!

  • Published May 10, 2024 | 7:29 PM Updated Updated May 10, 2024 | 7:29 PM

భారత జట్టు టీ20 ప్రపంచ కప్ నెగ్గాలంటే విరాట్ కోహ్లీని ఆ పొజిషన్​లో ఆడించాలని లెజెండ్ సౌరవ్ గంగూలీ సూచించాడు. దాదా ఇంకా ఏమన్నాడంటే..

భారత జట్టు టీ20 ప్రపంచ కప్ నెగ్గాలంటే విరాట్ కోహ్లీని ఆ పొజిషన్​లో ఆడించాలని లెజెండ్ సౌరవ్ గంగూలీ సూచించాడు. దాదా ఇంకా ఏమన్నాడంటే..

  • Published May 10, 2024 | 7:29 PMUpdated May 10, 2024 | 7:29 PM
Virat Kohli: వరల్డ్ కప్​ కొట్టాలంటే కోహ్లీని ఆ పొజిషన్​లో ఆడించాలి.. రోహిత్​కు గంగూలీ సూచన!

టీ20లు, వన్డేలు, టెస్టులు.. ఇలా ఫార్మాట్ ఏదైనా టీమిండియాను ఆపడం కష్టంగా ఉంది. ఈ మధ్య కాలంలో భారత జట్టు ఫుల్ ఫామ్​లో ఉంది. ఏ టోర్నీ, సిరీస్ అయినా అపోజిషన్ టీమ్స్​ను భయపెట్టి మరీ గెలుస్తోంది. అయితే దైపాక్షిక సిరీస్​లు, స్వదేశీ-విదేశీ సిరీస్​లు, ఆసియా కప్ వంటి టోర్నీల్లో హవా నడిపిస్తున్న టీమిండియా ఐసీసీ టోర్నీల్లో మాత్రం తేలిపోతోంది. ఫైనల్ వరకు వస్తున్నా కప్​ను చేజిక్కించుకోవడంలో ఫెయిల్ అవుతోంది. 2013 తర్వాత మన జట్టు ఒక్కసారి కూడా ఐసీసీ కప్పును సొంతం చేసుకోలేదు. సెమీస్, ఫైనల్ వరకు వెళ్లి రిక్తహస్తాలతో వచ్చేస్తోంది. గత మూడేళ్ల కాలంలో రెండుసార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ ఫైనల్​కు వెళ్లి రన్నరప్​గా నిలిచింది. గతేడాది వన్డే వరల్డ్ కప్​లోనూ సెకండ్ పొజిషన్​తో సరిపెట్టుకుంది.

అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 వరల్డ్ కప్​ను మాత్రం ఎగరేసుకుపోవాలని టీమిండియా దృఢ నిశ్చయంతో ఉంది. అందుకు తగ్గట్లే అద్భుతమైన టీమ్​ను సెలెక్ట్ చేసింది. ఈ తరుణంలో భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పొట్టి కప్పు కొట్టాలంటే స్టార్ బ్యాట్స్​మన్ విరాట్ కోహ్లీని ఓపెనర్​గా ఆడించాలని అన్నాడు. ఆ ప్లేస్​లో అతడు దుమ్మురేపడం ఖాయమని చెప్పాడు. ఐపీఎల్-2024లో ఆర్సీబీ తరఫున ఓపెనర్​గా దిగుతున్న విరాట్ బ్యాటింగ్ చేస్తున్న తీరుపై దాదా హర్షం వ్యక్తం చేశాడు. అతడు అద్భుతంగా ఆడుతున్నాడని మెచ్చుకున్నాడు. పంజాబ్ కింగ్స్​తో మ్యాచ్​లో కోహ్లీ ఆడిన తీరు మీద ప్రశంసల జల్లులు కురిపించాడు.

విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్​లో ఉన్నాడు. అతడు ఇప్పుడు అద్భుతంగా ఆడుతున్నాడు. పంజాబ్​ కింగ్స్​తో మ్యాచ్​లో తక్కువ టైమ్​లో 90 పరుగులు చేశాడు. టీ20 వరల్డ్ కప్​లో అతడ్ని ఓపెనింగ్ స్లాట్​లో వాడుకోవాలి. అతడు కచ్చితంగా ఇన్నింగ్స్​ను స్టార్ట్ చేయాలి. ఐపీఎల్​లో గత కొన్ని మ్యాచుల్లో అతడు ఆడుతున్న తీరు నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఇంత బాగా ఆడుతున్న ఆటగాడ్ని ఓపెనర్​గా దింపాల్సిందే’ అని గంగూలీ స్పష్టం చేశాడు. కింగ్​ను ఓపెనర్​గా ఆడించాలని రోహిత్​కు సూచించాడు దాదా. అతడు ఇన్నింగ్స్ మొదలుపెడితే భారత్​కు తిరుగుండదని పేర్కొన్నాడు. ఇక, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్​, కోహ్లీల్లో ఎవరు ఓపెనర్లుగా ఆడతారో చూడాలి. మరి.. కోహ్లీని ఓపెనర్​గా ప్రమోట్ చేయాలంటూ గంగూలీ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.