Nidhan
టీ20 వరల్డ్ కప్ టీమ్‌ను భారత క్రికెట్ బోర్డు అనౌన్స్ చేసింది. 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది. ఇందులో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..
టీ20 వరల్డ్ కప్ టీమ్‌ను భారత క్రికెట్ బోర్డు అనౌన్స్ చేసింది. 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది. ఇందులో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024కు టైమ్ దగ్గర పడుతోంది. మెగా టోర్నీ మొదలవడానికి ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. దీంతో అన్ని దేశాలు తమ స్క్వాడ్స్‌ను అనౌన్స్ చేస్తున్నాయి. నిన్న న్యూజిలాండ్ తమ వరల్డ్ కప్ టీమ్‌ను ప్రకటించగా.. ఇవాళ సౌతాఫ్రికా కూడా తమ జట్టు గురించి అనౌన్స్మెంట్ చేసింది. ప్రొటీస్ తర్వాత ఇప్పుడీ లిస్ట్‌లో భారత్ చేరింది. అందరూ ఐపీఎల్ హడావుడిలో ఉండగా సెలెక్టర్లు మాత్రం జట్టు ఎంపిక మీద పని చేస్తూ వచ్చారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో టీమ్ పటిష్టంగా ఉండేలా ప్లాన్ చేశారు. క్యాష్ రిచ్ లీగ్‌లో ప్లేయర్ల ఆటతీరును దగ్గర నుంచి గమనించారు. గత కొన్ని రోజులలుగా ఢిల్లీలో పలుమార్లు సమావేశమైన సెలెక్టర్లు, బీసీసీఐ పెద్దలు, కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ మొత్తానికి స్క్వాడ్‌ను ఖరారు చేశారు. మరి.. భారత ప్రపంచ కప్ జట్టులో ఎవరెవరికి చోటు దక్కిందో ఇప్పుడు చూద్దాం..
పొట్టి ప్రపంచ కప్‌లో భారత జట్టును రోహిత్ శర్మ కెప్టెన్‌గా ముందుండి టీమ్‌ను లీడ్ చేయనున్నాడు. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ దక్కింది. ఇక బ్యాటింగ్ యూనిట్లో పెద్దగా సంచలనాలు లేవు. సారథి రోహిత్‌తో పాటు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్, సెకండ్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ ఎంపికయ్యారు. పేస్ ఆల్‌రౌండర్ రోల్‌కు హార్దిక్ పాండ్యాతో పాటు బ్యాకప్‌గా శివమ్ దూబె కూడా కరీబియన్ దీవులకు వెళ్లనున్నాడు. స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ బెర్త్ కన్ఫర్మ్ అయింది. పేస్ అటాక్‌ను బుమ్రా లీడ్ చేయనుండగా.. అతడికి తోడుగా మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ ఉంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ఎంపికయ్యారు. వీళ్లతో పాటు రిజర్వ్డ్ ప్లేయర్లుగా శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్ కూడా విండీస్‌కు పయనం కానున్నారు. మరి.. భారత వరల్డ్ కప్ స్క్వాడ్‌పై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
భారత టీ20 వరల్డ్ కప్ జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
రిజర్వ్డ్ ప్లేయర్స్: శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.
INDIA’S T20 WORLD CUP SQUAD 🏆
Rohit (C), Kohli, Jaiswal, Surya, Pant (WK), Samson (WK), Hardik (VC), Dube, Jadeja, Axar, Kuldeep, Chahal, Arshdeep, Bumrah and Siraj.
Reserves – Gill, Rinku, Khaleel and Avesh. pic.twitter.com/DttwP0yKNa
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 30, 2024