iDreamPost
android-app
ios-app

పెళ్లైన మూడ్నెళ్లకే మరొకరితో.. షోయబ్ మాలిక్ మామూలోడు కాదు!

  • Published Apr 05, 2024 | 11:46 AM Updated Updated Apr 05, 2024 | 11:46 AM

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ఇటీవలే మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నటి సనా జావెద్​ను పెళ్లాడాడు స్టార్ బ్యాటర్.

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ఇటీవలే మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నటి సనా జావెద్​ను పెళ్లాడాడు స్టార్ బ్యాటర్.

  • Published Apr 05, 2024 | 11:46 AMUpdated Apr 05, 2024 | 11:46 AM
పెళ్లైన మూడ్నెళ్లకే మరొకరితో.. షోయబ్ మాలిక్ మామూలోడు కాదు!

ఫిల్మ్, స్పోర్ట్స్ సెలబ్రిటీల్లో డివోర్స్ అనేది కామన్ అయిపోయింది. అభిప్రాయ భేదాలు వస్తే విడాకులు ఇచ్చుకోవడం, ఇంకొకర్ని పెళ్లి చేసుకోవడం కూడా సర్వసాధారణంగా మారింది. ఈ క్రమంలో మూడ్నాలుగు మ్యారేజ్​లు చేసుకున్న వారు కూడా ఉన్నారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ఈ కోవలోకే వస్తాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు డివోర్స్ ఇచ్చి.. పాక్ నటి సనా జావెద్​ను ఈ ఏడాది జవనరిలో పెళ్లాడాడు మాలిక్. సానియా కంటే ముందు మరో అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని విడాకులు తీసుకున్న మాలిక్​కు సనాతో వివాహం మూడోది కావడం గమనార్హం. ఇటీవలే సనా బర్త్​డేను గ్రాండ్​గా సెలబ్రేట్ చేసుకున్నాడు మాలిక్. అతడు ఆడే మ్యాచ్​లకు ఆమె హాజరవుతూ స్టేడియాల్లో సందడి చేస్తున్నారు. ఈ తరుణంలో మాలిక్​కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

మూడో పెళ్లై మూడ్నెళ్లు కూడా కాలేదు అంతలోనే మరో నటి వెంట షోయబ్ పడుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్​కు చెందిన నవల్ సయీద్ అనే నటి రీసెంట్​గా లైఫ్ గ్రీన్ హై అనే ఇంటర్వ్యూకు అటెండ్ అయింది. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్, లైఫ్​కు సంబంధించిన అనేక విషయాలను పంచుకుంది. ఇదే క్రమంలో పలువురు పాక్ క్రికెటర్ల నుంచి తనకు మెసేజ్​లు వస్తున్నాయని తెలిపింది. అందులో మ్యారేజ్ అయిన క్రికెటర్లు కూడా ఉన్నారని చెప్పింది. దీంతో ఆమె ఇన్​డైరెక్ట్​గా మాలిక్ గురించి ప్రస్తావించిందని అంతా అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని హోస్ట్ ప్రశ్నించారు. మీరు షోయబ్ మాలిక్ గురించే మాట్లాడుతున్నారా? అని క్వశ్చన్ చేశారు. దీనికి స్పందనగా స్మైల్ ఇచ్చిన నవల్ సయీద్ అతడి పేరు గుర్తులేదని చెప్పింది. దీంతో ఆమె చెప్పింది షోయబ్ గురించేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు.

మెసేజ్​లు పంపిస్తున్నారంటూ నవల్ సయీద్ చేసిన వ్యాఖ్యలపై అదే ఇంటర్వ్యూలో యాంకర్ మరింత స్పష్టత కోరారు. ఎవరా ప్లేయర్లు? ఏమని మెసేజ్​లు పంపిస్తున్నారని అడిగారు. దీనికి రియాక్ట్ అయిన పాక్ నటి.. తాను వాటి గురించి ఇప్పుడు చెప్పదలచుకోలేదని తెలిపింది. అయితే క్రికెటర్లు అయి ఉండి అలా చేయడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని పేర్కొంది. సినీ నటుల కంటే క్రికెటర్లు, ఇతర క్రీడాకారులను చాలా మంది యువత ఆదర్శంగా తీసుకుంటారని నవల్ సయీద్ వివరించింది. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ ఆమెకు మెసేజ్ చేసింది పక్కా షోయబ్ మాలిక్ అనే అంటున్నారు. అతడి పేరు చెప్పగానే సయీద్ నవ్విందని.. ఇదే దీనికి ప్రూఫ్ అని​ చెబుతున్నారు. మాలిక్ మామూలోడు కాదని.. మూడో పెళ్లైన మూడ్నెళ్లకే మళ్లీ మొదలుపెట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. మరో నటిపై మాలిక్ కన్నేశాడంటూ వస్తున్న వార్తలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: GT vs PBKS: మాస్టర్​మైండ్ నెహ్రానే వణికించాడు! ఎవరీ అశుతోష్ శర్మ?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ