iDreamPost

GT vs PBKS: మాస్టర్​మైండ్ నెహ్రానే వణికించాడు! ఎవరీ అశుతోష్ శర్మ?

  • Published Apr 05, 2024 | 9:01 AMUpdated Apr 05, 2024 | 6:14 PM

గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో తెలిసిందే. మాస్టర్​మైండ్​గా పేరు తెచ్చుకున్న నెహ్రానే వణికించాడో ప్లేయర్. అతడే అశుతోష్ శర్మ.

గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో తెలిసిందే. మాస్టర్​మైండ్​గా పేరు తెచ్చుకున్న నెహ్రానే వణికించాడో ప్లేయర్. అతడే అశుతోష్ శర్మ.

  • Published Apr 05, 2024 | 9:01 AMUpdated Apr 05, 2024 | 6:14 PM
GT vs PBKS: మాస్టర్​మైండ్ నెహ్రానే వణికించాడు! ఎవరీ అశుతోష్ శర్మ?

గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో తెలిసిందే. మాస్టర్​మైండ్​గా పేరు తెచ్చుకున్న నెహ్రా.. జీటీ బౌలింగ్ సమయంలో బౌండరీ లైన్ దగ్గరే ఉంటాడు. మిగతా కోచ్​ల్లా డగౌట్​లో కూర్చొని మ్యాచ్​ను చూసే రకం కాదు. ఫోర్ లైన్ దగ్గర నిల్చొని, అటూ ఇటూ నడుస్తూ మ్యాచ్​ను అనుక్షణం గమనిస్తుంటాడు. ఎప్పటికప్పుడు మ్యాచ్ సిచ్యువేషన్స్​కు తగ్గట్లు ప్లాన్స్​ను మారుస్తుంటాడు. పంజాబ్ కింగ్స్​తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్​లోనూ ఇలాగే చేశాడు. కానీ అతడి స్ట్రాటజీని దెబ్బతీశాడో ప్లేయర్. గుజరాత్ చేతిలో ఉన్న మ్యాచ్​ను లాక్కున్నాడు. నెహ్రాను వణికించి.. పంజాబ్​కు హీరోగా మారిన ఆ బ్యాటరే అశుతోష్ శర్మ. అసలు ఎవరీ అశుతోష్? అతడి బ్యాగ్రౌండ్ ఏంటి? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నిన్నటి మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఛేజింగ్​లో పంజాబ్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో ఒక దశలో 111 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిందా టీమ్. బాగా ఆడుతున్న జితేష్ శర్మ (16) ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చాడు అశుతోష్. వచ్చిన బాల్​ను వచ్చినట్లు బలంగా బాదుతూ పోయాడు. 3 బౌండరీలు కొట్టిన అతడు ఓ భారీ సిక్స్ బాదాడు. మొత్తంగా 17 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఉన్నంత సేపు భారీ షాట్లతో పాటు సింగిల్స్, డబుల్స్​తో స్కోరు బోర్డును పరిగెత్తించాడు. బౌండరీ లైన్ దగ్గర నిల్చొని నెహ్రా ఎన్ని ప్లాన్స్ వేసినా వాటిని బ్రేక్ చేశాడు అశుతోష్. అప్పటికే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్న శశాంక్ సింగ్ (29 బంతుల్లో 61)ను ఒక ఎండ్​లో ఉంచి తానే గేమ్​ను ముందుకు నడిపించాడు.

శశాంక్​తో పాటు అశుతోష్​ను ఔట్ చేసి మ్యాచ్ ఫినిష్ చేయాలని గుజరాత్ అనుకుంది. అందుకు తగ్గట్లే కెప్టెన్​ శుబ్​మన్ గిల్​కు ఎప్పటికప్పుడు నెహ్రా సూచనలు ఇస్తూ వచ్చాడు. ఎలా బౌలింగ్ చేయించాలి? ఫీల్డింగ్ ఛేంజెస్ గురించి కూడా సబ్​స్టిట్యూట్ ఫీల్డర్లతో సలహాలు అందేలా చేశాడు. కానీ ఇవన్నీ గమనించిన అశుతోష్.. అటాకింగ్ మోడ్​లోకి వచ్చాడు. ఒకవైపు శశాంక్​ను సేఫ్​గా ఉంచి తాను మాత్రం అగ్రెసివ్​గా ఆడాడు. వికెట్​ను కాపాడుతూనే గ్యాప్స్​లోకి బంతుల్ని పంపించాడు. దీంతో మాస్టర్​మైండ్ నెహ్రా బిత్తరపోయాడు. డెబ్యూ మ్యాచ్​లోనే ఇంత మెచ్యూరిటీ, టెంప్రమెంట్​తో బ్యాటింగ్ చేయడం చూసి షాకయ్యాడు.

ఎవరీ అశుతోష్?

ఓడిపోయే మ్యాచ్​లో పంజాబ్ నెగ్గిందంటే ఎక్కువ క్రెడిట్ శశాంక్​కే వెళ్తుంది. కానీ నెహ్రా ప్లాన్స్​ను అమలు కాకుండా చేసి, గుజరాత్​ను ప్రెజర్​లోకి నెట్టిన అశుతోష్​ను కూడా మెచ్చుకోవాల్సిందే. ఇక, మధ్యప్రదేశ్​ తరఫున ఆడుతూ వెలుగులోకి వచ్చాడు అశుతోష్. ఆ తర్వాత రైల్వేస్ టీమ్​కు కూడా ప్రాతినిధ్యం వహించాడు. రైల్వేస్ తరఫున ఆడుతూ టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాది అందరి ఫోకస్​ను తన వైపునకు తిప్పుకున్నాడు. దీంతో ఈ సీజన్​కు ముందు జరిగిన వేలంలో బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది పంజాబ్. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ నుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందానని అతడు చెబుతుంటాడు. మరి.. అశుతోష్ ఆట మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి