iDreamPost
android-app
ios-app

నరైన్ ఎందుకు నవ్వడు? అసలు విషయం చెప్పేసిన ఆటగాళ్లు!

Sunil Narine Serious Behaviour- IPL 2024: ఐపీఎల్ 2024లో సునీల్ నరైన్ అద్భుతమైన ప్రదర్శనతో రెచ్చిపోతున్నాడు. అత్యధిక స్కోర్ చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. అయితే సునీల్ నరైన్ ఎందుకు అంత సీరియస్ గా ఉంటాటో మీకు తెలుసా? ఆటగాళ్లు చెప్పిన విశేషాలు ఇవే.

Sunil Narine Serious Behaviour- IPL 2024: ఐపీఎల్ 2024లో సునీల్ నరైన్ అద్భుతమైన ప్రదర్శనతో రెచ్చిపోతున్నాడు. అత్యధిక స్కోర్ చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. అయితే సునీల్ నరైన్ ఎందుకు అంత సీరియస్ గా ఉంటాటో మీకు తెలుసా? ఆటగాళ్లు చెప్పిన విశేషాలు ఇవే.

నరైన్ ఎందుకు నవ్వడు? అసలు విషయం చెప్పేసిన ఆటగాళ్లు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో క్రికెట్ ఫ్యాన్స్ అంతా ధనా ధన్ లీగ్ మజాని ఆస్వాదిస్తున్నారు. ఈసారి ప్రతి ఆటగాడు రెట్టించిన ఉత్సాహంతో ఆడుతున్నాడు. వాళ్లందరిలో కూడా కోల్ కతా నైట్ రైడర్స్ కు చెందిన కరేబియన్ వీరుడు సునీల్ నరైన్ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మ్యాచ్ ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా ఆకాశమే హద్దుగా సునీల్ నరైన్ చెలరేగిఆడుతున్నాడు. ఓపెనర్ గా వచ్చిన నరైన్ అలవోకగా అర్ధ శతకం నమోదు చేస్తున్నాడు. అయితే నరైన్ అస్సలు నవ్వడు ఆ విషయంపై ఇప్పటికీ చాలామందికి క్లారిటీ ఉండదు. అలా ఎందుకు అని. అయితే ఆ విషయాన్ని సహచరులు వెల్లడించారు.

సునీల్ నరైన్ పేరు వింటే ఎంతటి వరల్డ్ క్లాస్ బౌలర్ అయినా ఒక్క నిమిషం ఆలోచించాల్సిన పరిస్థితి. బుమ్రా, భువనేశ్వర్, ప్యాట్ కమ్మిన్స్ వంటి వాళ్లు ఎక్కడ బాల్ వేయాలో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎంత భారీ స్కోర్ చేసినా.. ఎంత గొప్ప బ్యాటర్ ను అవుట్ చేసినా కూడా సునీల్ నరైన్ మాత్రం అస్సలు సెలబ్రేట్ చేసుకోడు. అలాగే అస్సలు నవ్వడు కూడా. వికెట్ పడినా, అతని బాల్ ని భారీ సిక్సర్ కొట్టినా.. అతను ఎవరి బౌలింగ్ లో అయినా భారీ సిక్సర్ కొట్టినా అస్సలు సెలబ్రేట్ చేసుకోడు. కనీసం నవ్వడు కూడా. అయితే అలా ఎందుకు ఉంటాడో అతని సహచరులు వెల్లడించారు.

Sunil Narine

ఐపీఎల్ టీమ్స్ అన్నీ కొన్ని స్పెషల్ వీడియోస్ చేస్తూ ఉంటాయి. అలాగే సునీల్ నరైన్ ఎందుకు నవ్వడో అడుగుతూ ఒక వీడియో చేసింది. దాంట్లో రఘువన్షీ, ఆండ్రీ రస్సెల్, సాల్ట్ వంటి వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సాల్ట్ మాట్లాడుతు.. “నరైన్ చాలా తటస్థమైన మెంటాలిటీ కలిగిన వ్యక్తి. అతను చాలా సమర్థుడు. ఇద్దరు ఆటగాళ్లను కలిపితే సునీల్ నరైన్ తో సమానం. అతను క్రికెట్ నుఅమితంగా ప్రేమిస్తాడు” అంటూ సాల్ట్ వెల్లడించాడు. ఆండ్రీ రస్సెల్ మాట్లాడుతూ.. “అతను అంత కామ్ గా ఉండటానికి అతని అనుభవమే కారణం. 500 మ్యాచులు ఆడిన అనుభవం ఉన్న సునీల్ నరైన్ లాంటి ఆటగాడికి అంత తేలిగ్గా ఉద్రేకం రాదు” అంటూ అండ్రీ రస్సెల్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

ఇంక రఘువన్షీ మాట్సాడుతూ.. “సునీల్ నరైన్ టీమ్ లెజెండ్. బ్యాటుతో బాల్ తో అద్భుతాలు సృష్టించగలడు. గేమ్ వరకే నరైన్ అంత సీరియస్ గా ఉంటాడు. డగౌట్ లో మాత్రం ఎంతో సరదాగా ఉంటాడు. జోకులు వేస్తాడు” అంటూ ఈ కుర్రాడు చెప్పుకొచ్చాడు. ఇంక ఈ ఐపీఎల్ సీజన్లో 11 మ్యాచులు ఆడిన సునీల్ నరైన్ 183.67 స్ట్రైక్ రేట్ తో 461 పరుగులు చేశాడు. ఈ సీజన్లో టాప్ స్కోర్ చేసిన ఆటగాళ్ల జాబితాలో సునీల్ నరైన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. సునీల్ నరైన్ ప్రదర్శన, అతని అనుభవంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.