Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆ గౌరవానికి అర్హుడని లెజెండ్ యువరాజ్ సింగ్ అన్నాడు. అతడికి అది దక్కి తీరాలని చెప్పాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆ గౌరవానికి అర్హుడని లెజెండ్ యువరాజ్ సింగ్ అన్నాడు. అతడికి అది దక్కి తీరాలని చెప్పాడు.
Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సుదీర్ఘ కెరీర్లో అందరితోనూ మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేశాడు. తోటి ప్లేయర్లతో పాటు ఇతర జట్ల ఆటగాళ్లతోనూ అతడికి మంచి బాండింగ్ ఉంది. అంతెందుకు అంపైర్లతోనూ కలివిడిగా ఉంటూ జోక్స్ వేస్తూ గ్రౌండ్లో ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంటాడు హిట్‌మ్యాన్. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా అతడు ఎంతో సాధించాడు. వరల్డ్ బెస్ట్ బ్యాటర్స్‌లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇంత సాధించినా అతడిలో ఇసుమంత గర్వం లేదు. అందుకే అందరూ రోహిత్‌ను అంతగా ఇష్టపడుతుంటారు. భారత లెజెండ్ యువరాజ్ సింగ్‌కు కూడా హిట్మ్యాన్లోని ఆ గుణం అంటే చాలా ఇష్టమట. ఎంత ఎత్తుకు ఎదిగినా అతడిలో మార్పు రాలేదన్నాడు.
రోహిత్ శర్మ గురించి యువరాజ్ మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్‌మ్యాన్ ఇంగ్లీష్ అంతగా బాగోదన్నాడు. కానీ చాలా సరదా వ్యక్తి అని.. అతడి మనసు మాత్రం వెన్న అంటూ మెచ్చుకున్నాడు యువీ. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటాన్ని రోహిత్ అలవర్చుకున్నాడని, అతడిలో తనకు నచ్చే లక్షణం అదేనని ప్రశంసల్లో ముంచెత్తాడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వాతావరణం సందడిగా, ఎంటర్టైనింగ్గా ఉంటుందన్నాడు. క్రికెట్లో తనకు ఉన్న అతి తక్కువ మంది క్లోజ్ ఫ్రెండ్స్‌లో రోహిత్ కూడా ఒకడని యువీ తెలిపాడు. తాను చూసిన బెస్ట్ కెప్టెన్స్‌లో హిట్‌మ్యాన్ ఒకడని అన్నాడు.
రోహిత్‌ను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని అనుకుంటున్నానని యువీ అన్నాడు. ‘ప్రపంచ కప్ ట్రోఫీతో రోహిత్‌ను చూడాలని ఉంది. అతడి మెడలో వరల్డ్ కప్ మెడల్ ఉండాలి. ఆ గౌరవానికి అతడు నిజంగా అర్హుడు. అతడికి అది దక్కి తీరాలి’ అని యువీ స్పష్టం చేశాడు. టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ లాంటి సెన్సిబుల్ కెప్టెన్ లీడ్ చేస్తుండటం టీమిండియాకు ఎంతగానో లాభిస్తుందన్నాడు. ప్రెజర్ సిచ్యువేషన్స్లోనూ కూల్‌గా ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో హిట్‌మ్యాన్ ఆరితేరాడని మెచ్చుకున్నాడు. 5 ఐపీఎల్ కప్పులు కొట్టినోడు, వన్డే వరల్డ్ కప్-2023లో భారత్‌ను ఫైనల్‌కు చేర్చినోడి కంటే బెస్ట్ కెప్టెన్ మనకు దొరకడని వ్యాఖ్యానించాడు యువీ. మరి.. యువీ కోరుకున్నట్లు రోహిత్ వరల్డ్ కప్ కొడతాడని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.
Yuvraj Singh 🤝 Rohit Sharma.
– Two Greats of Indian cricket history. pic.twitter.com/dX6YntJkkC
— Johns. (@CricCrazyJohns) May 7, 2024