Nidhan
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి ఐపీఎల్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. నిన్న కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ అతడి ఫ్లాప్ షో కంటిన్యూ అయింది. అసలు ఆడుతోంది హిట్మ్యానేనా అని అతడి ఫ్యాన్స్ సందేహిస్తున్నారు.
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి ఐపీఎల్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. నిన్న కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ అతడి ఫ్లాప్ షో కంటిన్యూ అయింది. అసలు ఆడుతోంది హిట్మ్యానేనా అని అతడి ఫ్యాన్స్ సందేహిస్తున్నారు.
Nidhan
కెప్టెన్సీ బాధ్యతలు లేవు. త్వరలో టీ20 వరల్డ్ కప్-2024 జరగనుంది. కాబట్టి బ్యాటింగ్‌లో అదరగొడతాడని అంతా అనుకున్నారు. క్యాష్ రిచ్ లీగ్ మొదలవడానికి ముందు ఆఫ్ఘానిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో సెంచరీ కూడా బాదాడు. దీంతో ఈసారి ఐపీఎల్లో దుమ్మురేపుతాడని అంతా అనుకున్నారు. సారథ్య బాధ్యతల నుంచి తీసేసిన టీమ్ మేనేజ్మెంట్కు తన బ్యాట్‌తోనే ఆన్సర్ ఇస్తాడని భావించారు. బ్యాటర్‌గానే జట్టుకు మరో కప్పు అందిస్తాడని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ టోటల్ ఫెయిలయ్యాడు. మనం మాట్లాడుకుంటోంది మరెవరి గురించో కాదు.. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గురించే. ఈసారి ఐపీఎల్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు హిట్‌మ్యాన్.
ఈ ఐపీఎల్లో రోహిత్ ఫ్లాఫ్ షో నడుస్తోంది. సీజన్ మొత్తం మీద ఒక సెంచరీ కొట్టిన హిట్‌మ్యాన్.. సెకండ్ బెస్ట్ స్కోరు 49గా ఉంది. ఆడిన 13 మ్యాచుల్లో కలిపి 345 పరుగులు మాత్రమే చేయగలిగాడు. సెంచరీని మినహాయిస్తే మిగిలిన మ్యాచుల్లో రోహిత్ స్కోర్లు ఇలా ఉన్నాయి.. 43, 26, 0, 49, 38, 36, 6, 8, 4, 11, 19. గత ఐదు మ్యాచుల్లో కనీసం 30 స్కోరు దాటలేకపోయాడు. నిన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లోనూ అతడి బ్యాట్ గర్జింజలేదు. దీంతో అసలు ఆడుతోంది హిట్మ్యానేనా అని అందరూ సందేహిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఇదేం బ్యాటింగ్ అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ బ్యాటింగ్ ఫెయిల్యూర్‌కు గల పలు కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఆఫ్ స్పిన్ ఆడటంలో రోహిత్ శర్మ కాస్త వీక్ అనే విషయం తెలిసిందే. బడా స్పిన్నర్లు కాదు.. పార్ట్ టైమ్ ఆఫ్ బ్రేక్ బౌలర్లు కూడా గతంలో హిట్‌మ్యాన్‌ను చాలా సార్లు ఔట్ చేశారు. అదే బలహీనత ఈసారి ఐపీఎల్‌లోనూ అతడ్ని వేధిస్తోంది. ఈ సీజన్లో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ లాంటి క్వాలిటీ ఆఫ్ స్పిన్నర్లకు అతడు దొరికిపోయాడు. అలాగే లెఫ్టార్మ్ పేసర్లను హ్యాండిల్ చేయడంలోనూ హిట్‌మ్యాన్ వీక్ అనేది తెలిసిందే. దీన్ని ట్రెంట్ బౌల్ట్, ఖలీల్ అహ్మద్ లాంటి లెఫ్టార్మ్ స్పీడ్‌స్టర్స్ యూజ్ చేసుకొని ఔట్ చేశారు. కెప్టెన్సీ భారం లేదు.. అయినా స్వేచ్ఛగా ఆడాల్సిన రోహిత్ అనవసర ఒత్తిడికి లోనై ఔట్ అవుతున్నాడు.
స్పిన్నర్లు, లెఫ్టార్మ్ పేసర్లకు తగ్గట్లు తన బ్యాటింగ్ టెక్నిక్‌ను రోహిత్ మెరుగుపర్చుకోలేదు. ఇది కూడా అతడి ఫెయిల్యూర్‌కు బిగ్ రీజన్ అని చెప్పొచ్చు. ఈ సీజన్లో ఐదారు ఇన్నింగ్స్‌ల్లో మంచి స్టార్ట్స్ అందుకున్నాడు హిట్‌మ్యాన్. కానీ వాటిని బిగ్ స్కోర్స్‌గా కన్వర్ట్ చేయలేకపోయాడు. క్రీజులో సెటిల్ అయ్యాక రాంగ్ షాట్స్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఈ తప్పులన్నీ ఐపీఎల్లో రోహిత్ జోరుకు బ్రేకులు వేశాయి. వీటిని దాటితేనే వరల్డ్ కప్‌లో రాణించగలడు. మరి.. హిట్‌మ్యాన్ ఫెయిల్యూర్‌కు ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.