iDreamPost
android-app
ios-app

MS Dhoni: లెజెండ్ అని ఊరికే అనలేదు.. ఫ్యాన్స్ కోసం ధోని చేస్తున్న పని తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

  • Published May 12, 2024 | 11:02 AMUpdated May 12, 2024 | 11:02 AM

లెజెండరీ కెప్టెన్​గా, బ్యాటర్​గా ఎంతో పేరు గడించాడు మహేంద్ర సింగ్ ధోని. టీమిండియాను అన్ని ఫార్మాట్లలోనూ నంబర్​ వన్​గా నిలిపిన మాహీ.. ఐపీఎల్​లోనూ సీఎస్​కేకు 5 కప్పులు అందించాడు. అలాంటోడు అభిమానుల కోసం ఏం చేసేందుకైనా సిద్ధమని మరోమారు నిరూపించాడు.

లెజెండరీ కెప్టెన్​గా, బ్యాటర్​గా ఎంతో పేరు గడించాడు మహేంద్ర సింగ్ ధోని. టీమిండియాను అన్ని ఫార్మాట్లలోనూ నంబర్​ వన్​గా నిలిపిన మాహీ.. ఐపీఎల్​లోనూ సీఎస్​కేకు 5 కప్పులు అందించాడు. అలాంటోడు అభిమానుల కోసం ఏం చేసేందుకైనా సిద్ధమని మరోమారు నిరూపించాడు.

  • Published May 12, 2024 | 11:02 AMUpdated May 12, 2024 | 11:02 AM
MS Dhoni: లెజెండ్ అని ఊరికే అనలేదు.. ఫ్యాన్స్ కోసం ధోని చేస్తున్న పని తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

భారత క్రికెట్​లో సువర్ణాక్షరాలతో రాయాల్సిన పేర్లలో ఒకటి మహేంద్ర సింగ్ ధోని. ఎన్నో ఏళ్ల వరల్డ్ కప్​ కలను తీర్చిన కెప్టెన్ అతడు. టీ20 ప్రపంచ కప్​తో పాటు వన్డే వరల్డ్ కప్​నూ టీమిండియాకు అందించాడు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఒకమారు మెన్ ఇన్ బ్లూను ఛాంపియన్స్​గా నిలిపాడు. అతడి సారథ్యంలో జట్టు అన్ని ఫార్మాట్లలోనూ నంబర్​ వన్​గా ఉండేది. భారత జట్టుకే కాదు.. ఐపీఎల్​లో​ చెన్నై సూపర్ కింగ్స్​ను కూడా అంతే సక్సెస్​ఫుల్​గా నడిపించాడు మాహీ. ఆ టీమ్​కు ఏకంగా 5 కప్పులు అందించాడు. ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్​కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పి కీపర్, బ్యాటర్​గానే కొనసాగుతున్నాడు. అయినా అతడిపై విమర్శలు తప్పడం లేదు.

ఐపీఎల్-2024లో ధోని బ్యాట్​తో చెలరేగుతున్నాడు. ఆఖర్లో వచ్చి ధనాధన్ షాట్లతో అదరగొడుతున్నాడు. టీమ్ భారీ స్కోర్లు అందుకోవడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఇంత బాగా ఆడుతున్నోడు బ్యాటింగ్ ఆర్డర్​లో పైకి రావొచ్చు కదా? టాపార్డర్​లో ఆడకపోతే ఇంటికి వెళ్లిపోవడం బెటర్.. చివర్లో వచ్చి ఆడినా టీమ్ గెలవడం లేదు అంటూ మాహీని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ధోని పైకి వచ్చి ఆడుంటే సీఎస్​కే ఈపాటికే ప్లేఆఫ్స్ చేరేదని, అతడి నిర్లక్ష్యం వల్లే జట్టు కష్టాలు పడుతోందని అంటున్నారు. అయితే చెన్నై కోసం, తనను ఎంతగానో ప్రేమించే ఆ జట్టు ఫ్యాన్స్ కోసం మాహీ చేస్తున్న త్యాగం గురించి తెలిస్తే ఈ మాట అనలేరు. గతేడాది ఐపీఎల్​ టైమ్​లోనే ధోని గాయపడ్డాడు. ఇంజ్యురీతో బాధపడుతూనే ఆ సీజన్ ఆడేశాడు. ఆ తర్వాత సర్జరీ చేయించుకున్నాడు. కానీ కంప్లీట్​గా రికవర్ కాలేదు.

సీఎస్​కే మేనేజ్​మెంట్ తన మీద పెట్టిన బాధ్యత, అభిమానులు తన ఆట కోసం ఎదురుచూస్తుండటంతో పంటి కింద నొప్పిని భరిస్తూనే ఈ సీజన్​లో కూడా ఆడుతున్నాడు ధోని. గాయం ఇబ్బంది పెడుతుండటంతో బ్యాటింగ్ సమయంలో ఎక్కువగా పరిగెత్తకుండా షాట్లు మాత్రమే ఆడుతున్నాడు. ఇప్పుడు నెట్టింట ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఇందులో బ్యాటింగ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్​కు వెళ్తూ కనిపించాడు మాహీ. అతడి చేతిలో నడుముకు పెట్టుకునే బ్యాండ్ ఉంది. దీన్ని బట్టే నడుము నొప్పి ఇబ్బంది పెడుతున్నా ఫ్యాన్స్ కోసం అతడు గ్రౌండ్​లోకి దిగాడని చెప్పొచ్చు. ఈ ఫొటో చూసిన నెటిజన్స్.. లెజెండ్ అని ఊరికే అనలేదని అంటున్నారు. మరి.. గాయం వెంటాడుతున్నా, నొప్పి భరిస్తూనే ఫ్యాన్స్ కోసం ధోని గ్రౌండ్​లోకి దిగడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి