iDreamPost

IPLలో కొనసాగుతున్న రోహిత్ ఫ్లాప్ షో.. అసలు హిట్​మ్యాన్​కు ఏమైంది?

  • Published May 12, 2024 | 11:39 AMUpdated May 12, 2024 | 11:39 AM

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి ఐపీఎల్​లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. నిన్న కేకేఆర్​తో మ్యాచ్​లోనూ అతడి ఫ్లాప్ షో కంటిన్యూ అయింది. అసలు ఆడుతోంది హిట్​మ్యానేనా అని అతడి ఫ్యాన్స్ సందేహిస్తున్నారు.

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి ఐపీఎల్​లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. నిన్న కేకేఆర్​తో మ్యాచ్​లోనూ అతడి ఫ్లాప్ షో కంటిన్యూ అయింది. అసలు ఆడుతోంది హిట్​మ్యానేనా అని అతడి ఫ్యాన్స్ సందేహిస్తున్నారు.

  • Published May 12, 2024 | 11:39 AMUpdated May 12, 2024 | 11:39 AM
IPLలో కొనసాగుతున్న రోహిత్ ఫ్లాప్ షో.. అసలు హిట్​మ్యాన్​కు ఏమైంది?

కెప్టెన్సీ బాధ్యతలు లేవు. త్వరలో టీ20 వరల్డ్ కప్​-2024 జరగనుంది. కాబట్టి బ్యాటింగ్​లో అదరగొడతాడని అంతా అనుకున్నారు. క్యాష్ రిచ్ లీగ్ మొదలవడానికి ముందు ఆఫ్ఘానిస్థాన్​తో టీ20 సిరీస్​లో సెంచరీ కూడా బాదాడు. దీంతో ఈసారి ఐపీఎల్​లో దుమ్మురేపుతాడని అంతా అనుకున్నారు. సారథ్య బాధ్యతల నుంచి తీసేసిన టీమ్ మేనేజ్​మెంట్​కు తన బ్యాట్​తోనే ఆన్సర్ ఇస్తాడని భావించారు. బ్యాటర్​గానే జట్టుకు మరో కప్పు అందిస్తాడని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ టోటల్ ఫెయిలయ్యాడు. మనం మాట్లాడుకుంటోంది మరెవరి గురించో కాదు.. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గురించే. ఈసారి ఐపీఎల్​లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు హిట్​మ్యాన్.

ఐపీఎల్​లో రోహిత్ ఫ్లాఫ్ షో నడుస్తోంది. సీజన్ మొత్తం మీద ఒక సెంచరీ కొట్టిన హిట్​మ్యాన్​.. సెకండ్ బెస్ట్ స్కోరు 49గా ఉంది. ఆడిన 13 మ్యాచుల్లో కలిపి 345 పరుగులు మాత్రమే చేయగలిగాడు. సెంచరీని మినహాయిస్తే మిగిలిన మ్యాచుల్లో రోహిత్ స్కోర్లు ఇలా ఉన్నాయి.. 43, 26, 0, 49, 38, 36, 6, 8, 4, 11, 19. గత ఐదు మ్యాచుల్లో కనీసం 30 స్కోరు దాటలేకపోయాడు. నిన్న కోల్​కతా నైట్ రైడర్స్​తో మ్యాచ్​లోనూ అతడి బ్యాట్ గర్జింజలేదు. దీంతో అసలు ఆడుతోంది హిట్​మ్యానేనా అని అందరూ సందేహిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్​కు ముందు ఇదేం బ్యాటింగ్ అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ బ్యాటింగ్ ఫెయిల్యూర్​కు గల పలు కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఆఫ్ స్పిన్ ఆడటంలో రోహిత్ శర్మ కాస్త వీక్ అనే విషయం తెలిసిందే. బడా స్పిన్నర్లు కాదు.. పార్ట్ టైమ్ ఆఫ్ బ్రేక్ బౌలర్లు కూడా గతంలో హిట్​మ్యాన్​ను చాలా సార్లు ఔట్ చేశారు. అదే బలహీనత ఈసారి ఐపీఎల్​లోనూ అతడ్ని వేధిస్తోంది. ఈ సీజన్​లో వరుణ్​ చక్రవర్తి, సునీల్ నరైన్ లాంటి క్వాలిటీ ఆఫ్ స్పిన్నర్లకు అతడు దొరికిపోయాడు. అలాగే లెఫ్టార్మ్ పేసర్లను హ్యాండిల్ చేయడంలోనూ హిట్​మ్యాన్​ వీక్​ అనేది తెలిసిందే. దీన్ని ట్రెంట్ బౌల్ట్, ఖలీల్ అహ్మద్ లాంటి లెఫ్టార్మ్ స్పీడ్​స్టర్స్ యూజ్ చేసుకొని ఔట్ చేశారు. కెప్టెన్సీ భారం లేదు.. అయినా స్వేచ్ఛగా ఆడాల్సిన రోహిత్ అనవసర ఒత్తిడికి లోనై ఔట్ అవుతున్నాడు.

స్పిన్నర్లు, లెఫ్టార్మ్ పేసర్లకు తగ్గట్లు తన బ్యాటింగ్ టెక్నిక్​ను రోహిత్ మెరుగుపర్చుకోలేదు. ఇది కూడా అతడి ఫెయిల్యూర్​కు బిగ్ రీజన్​ అని చెప్పొచ్చు. ఈ సీజన్​లో ఐదారు ఇన్నింగ్స్​ల్లో మంచి స్టార్ట్స్ అందుకున్నాడు హిట్​మ్యాన్. కానీ వాటిని బిగ్ స్కోర్స్​గా కన్వర్ట్ చేయలేకపోయాడు. క్రీజులో సెటిల్ అయ్యాక రాంగ్ షాట్స్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఈ తప్పులన్నీ ఐపీఎల్​లో రోహిత్ జోరుకు బ్రేకులు వేశాయి. వీటిని దాటితేనే వరల్డ్ కప్​లో రాణించగలడు. మరి.. హిట్​మ్యాన్​ ఫెయిల్యూర్​కు ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sportskeeda Cricket (@sportskeedacricket)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి