Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు ఇది క్రేజీ న్యూస్. టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ వేస్తున్న మాస్టర్ స్కెచ్ గురించి తెలిస్తే భారత జట్టు అభిమానులంతా ఎగిరి గంతేయాల్సిందే.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు ఇది క్రేజీ న్యూస్. టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ వేస్తున్న మాస్టర్ స్కెచ్ గురించి తెలిస్తే భారత జట్టు అభిమానులంతా ఎగిరి గంతేయాల్సిందే.
Nidhan
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ప్రస్తుత క్రికెట్లో వీళ్లను మించిన ప్లేయర్స్ లేరు. ఇద్దరూ ఇద్దరే. ఒకరు ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ చేస్తూ ప్రత్యర్థి జట్లను డిఫెన్స్‌లో పెడితే.. మరొకరు ఆఖరు వరకు నిలబడి యాంకర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టే రకం. ఆటతీరు వేర్వేరు కావొచ్చు గానీ మ్యాచ్‌ను మలుపు తిప్పడంలోనూ, టీమ్‌ను గెలిపించడంలోనూ ఇద్దరిదీ అందెవేసిన చేయి. కలసికట్టుగా ఆడి ఎన్నో మ్యాచుల్లో టీమిండియాను గెలిపించారు రోకో జోడీ. వీళ్లిద్దరూ క్రీజులో ఉంటే అపోజిషన్ బౌలర్ల పని ఫినిష్. రోహిత్ బాదుడును, కోహ్లీ స్ట్రయిక్ రొటేషన్‌ను తట్టుకోలేక ఎంతటి బౌలర్ అయినా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోవాల్సిందే. అలాంటి ఈ జోడీ విషయంలో భారత క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
ఐపీఎల్ ముగిసిన తర్వాత టీ20 వరల్డ్ కప్-2024 ప్రారంభం కానుంది. మెగా టోర్నీలో పాల్గొనే జట్లకు సంబంధించిన పలు వివరాలను ప్రకటించాల్సి ఉంది. టీమ్ స్క్వాడ్స్ కూడా ఫైనలైజ్ కావాలి. మరికొన్ని రోజుల్లో ప్రతి దేశం తమ ప్రపంచ కప్ టీమ్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. భారత సెలక్టర్లు కూడా ఈ విషయంపై సీరియస్‌గా పని చేస్తున్నారు. బ్యాటింగ్ యూనిట్, ఆల్‌రౌండర్లు, పేసర్లు, స్పిన్నర్లు.. ఇలా దాదాపుగా అన్ని విభాగాల ఎంపికపై బోర్డు ఓ అవగాహనకు వచ్చిందట. అయితే ఈసారి రోహిత్-కోహ్లీ జోడీతో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైందట. టీ20 వరల్డ్ కప్‌లో ఈ పాపులర్ ప్లేయర్స్‌ను ఓపెనర్లుగా బరిలోకి దింపాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.
వరల్డ్ కప్‌లో రోహిత్-కోహ్లీని ఓపెనర్లుగా దింపాలని బీసీసీఐ భావిస్తోందట. ఈ విషయాన్ని కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కలసి హిట్‌మ్యాన్‌తో డిస్కస్ కూడా చేశారట. దీనికి రోహిత్ కూడా ఓకే చెప్పాడని వినిపిస్తోంది. టీమిండియాకు అతడు ఎలాగూ ఓపెనర్‌గానే ఉన్నాడు. కెప్టెన్‌కు జంటగా మరో ఓపెనర్‌గా విరాట్‌ను పంపాలని ఫిక్స్ అయ్యారని టాక్ నడుస్తోంది. ఆల్రెడీ ఐపీఎల్లో కోహ్లీ ఆర్సీబీ తరఫున అదే పొజిషన్లో ఆడుతున్నాడు. ఓపెనర్‌గా వచ్చి సెంచరీ కూడా బాదిన కింగ్.. ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. కాబట్టి అతడితో వరల్డ్ కప్‌లోనూ ఓపెనింగ్ చేయించాలని బోర్డు పెద్దలు డిసైడ్ అయ్యారని సమాచారం. ఈ విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. బీసీసీఐ ఆలోచన సూపర్బ్ అని.. రోకో జంటను ఆపడం ఎవరి వల్లా కాదని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రోహిత్-కోహ్లీని ఓపెనర్లుగా చూడాలని మీరు కోరుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.
Major talking points after the discussion between Rohit – Dravid – Agarkar about the T20I WC [Abhishek Tripathi from Dainik Jagran]:
– Rohit & Kohli will open.
– Hardik needs to bowl more in IPL.
– Gill might be the backup opener.
– Riyan Parag in scheme of things. pic.twitter.com/DC2SwSdfD7— Johns. (@CricCrazyJohns) April 17, 2024