iDreamPost
android-app
ios-app

ఆ ఒక్క పని చేస్తే ప్లేఆఫ్స్ ఏంటి.. RCB కప్పు కూడా కొడుతుంది: కైఫ్

  • Published May 15, 2024 | 9:38 PM Updated Updated May 15, 2024 | 9:38 PM

ప్లేఆఫ్స్ రేసులో దూసుకెళ్తున్న ఆర్సీబీ గురించి మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ ఒక్క పని చేస్తే ప్లేఆఫ్స్ ఏంటి.. బెంగళూరు కప్పు కూడా కొడుతుందని అన్నాడు.

ప్లేఆఫ్స్ రేసులో దూసుకెళ్తున్న ఆర్సీబీ గురించి మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ ఒక్క పని చేస్తే ప్లేఆఫ్స్ ఏంటి.. బెంగళూరు కప్పు కూడా కొడుతుందని అన్నాడు.

  • Published May 15, 2024 | 9:38 PMUpdated May 15, 2024 | 9:38 PM
ఆ ఒక్క పని చేస్తే ప్లేఆఫ్స్ ఏంటి.. RCB కప్పు కూడా కొడుతుంది: కైఫ్

ఐపీఎల్-2024లో ఇప్పుడు అందరి ఫోకస్ ఒకే మ్యాచ్ మీద నెలకొంది. ఆ మ్యాచ్ చుట్టూనే జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్, కోల్​కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకున్నాయి. మే 18వ తేదీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ రోజున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్​తో ప్లేఆఫ్స్​లో మరో బెర్త్ మీద కన్ఫర్మేషన్ రానుంది. ఆ మ్యాచ్​లో ఎవరు నెగ్గితే వాళ్లు క్వాలిఫై అవుతారు. సీఎస్​కే జస్ట్ గెలిస్తే సరిపోతుంది. అదే ఆర్సీబీ మాత్రం ముందు బౌలింగ్​కు దిగితే 18.1 ఓవర్లలో మ్యాచ్​ను ఫినిష్ చేయాలి. అదే తొలుత బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో చెన్నైని ఓడించాల్సి ఉంటుంది. ఈ తరుణంలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఆర్సీబీ కప్పు కొట్టాలంటే జట్టులో ఎక్కువ మంది ఇండియన్ ప్లేయర్స్​కు ఛాన్స్ ఇవ్వాలని సూచించాడు కైఫ్. ఆ పని చేస్తే ప్లేఆఫ్స్ ఏంటి.. ఏకంగా ఫైనల్​కు కూడా వెళ్లి టైటిల్​ను గెలుచుకోవచ్చన్నాడు. ఈ సీజన్ మొదట్లో 6 మ్యాచుల్లో ఓడిపోవడం బెంగళూరును దారుణంగా దెబ్బతీసిందన్నాడు. అయితే ఆ తర్వాత స్పీడ్ అందుకొని విజయాల బాట పట్టడం శుభపరిణామమని తెలిపాడు. ఇప్పుడు కూడా డుప్లెసిస్ సేనకు ప్లేఆఫ్స్​ చేరుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ‘సీజన్ మొదట్లో వరుస మ్యాచుల్లో ఓడిపోవడం ఆర్సీబీకి శాపంగా మారింది. అయితే ఆ తర్వాత కోలుకొని మళ్లీ గెలుపు బాట పట్టారు. ఆ టీమ్​కు ఇంకా ప్లేఆఫ్స్ ఛాన్సులు ఉన్నాయి. ఏదైనా టీమ్ 16 పాయింట్లు సాధిస్తే కష్టం. కానీ ఆర్సీబీకి ఇంకా దారులు మూసుకుపోలేదు. ఆ జట్టు కమ్​బ్యాక్ ఇచ్చిన తీరును అందరూ మెచ్చుకోవాల్సిందే’ అని కైఫ్ పేర్కొన్నాడు.

గ్లెన్ మ్యాక్స్​వెల్ లాంటి ఫారెన్ ప్లేయర్లు ఆడితేనే గెలుస్తారనే సిచ్యువేషన్​ నుంచి ఆర్సీబీ బయటపడిందన్నాడు కైఫ్. ఆ టీమ్ మేనేజ్​మెంట్ ప్రతిభావంతులైన భారత ఆటగాళ్లను పట్టుకొని ట్రైన్ చేయడంపై ఫోకస్ చేయాలని సూచించాడు కైఫ్. కోల్​కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లు ఇండియన్ ప్లేయర్స్​ను నమ్ముకొని సక్సెస్ అయ్యాయని.. ఆర్సీబీ కూడా అదే పని చేయాలన్నాడు. ఈ సీజన్​ దాదాపుగా పూర్తయినట్లేనని.. కాబట్టి నెక్స్ట్ సీజన్​లో అయినా టాలెంటెడ్ డొమెస్టిక్ క్రికెటర్స్​ను టీమ్​లోకి తీసుకోవడంపై పని చేయాలని వివరించాడు కైఫ్. స్థానిక ఆటగాళ్లను గుర్తించి వాళ్లకు సపోర్ట్ చేయాలని, వాళ్లను హీరోలుగా మలచాలని హితవు పలికాడు. ఫారెన్ ప్లేయర్లను కాకుండా లోకల్ వాళ్లను నమ్ముకుంటే ఆర్సీబీ కప్పు కొట్టడం పక్కా అని కైఫ్ స్పష్టం చేశాడు. మరి.. కైఫ్ చెప్పినట్లు చేస్తే బెంగళూరుకు టైటిల్ వస్తుందని మీరు అనుకుంటే కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Star Sports India (@starsportsindia)