iDreamPost

ప్లేఆఫ్స్​ బెర్త్ కోసం RCB-CSK మధ్య ఫైట్.. ఎవరు గెలుస్తారో చెప్పిన హర్భజన్!

  • Published May 15, 2024 | 8:36 PMUpdated May 15, 2024 | 8:36 PM

ప్లేఆఫ్స్ బెర్త్ కోసం ఆర్సీబీ, సీఎస్​కే ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్​లో ఎవరు నెగ్గితే వాళ్లు క్వాలిఫై అవుతారు. ఈ నేపథ్యంలో లెజెండ్ హర్భజన్ సింగ్ తన ప్రిడిక్షన్ చెప్పాడు.

ప్లేఆఫ్స్ బెర్త్ కోసం ఆర్సీబీ, సీఎస్​కే ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్​లో ఎవరు నెగ్గితే వాళ్లు క్వాలిఫై అవుతారు. ఈ నేపథ్యంలో లెజెండ్ హర్భజన్ సింగ్ తన ప్రిడిక్షన్ చెప్పాడు.

  • Published May 15, 2024 | 8:36 PMUpdated May 15, 2024 | 8:36 PM
ప్లేఆఫ్స్​ బెర్త్ కోసం RCB-CSK మధ్య ఫైట్.. ఎవరు గెలుస్తారో చెప్పిన హర్భజన్!

ఐపీఎల్-2024 రసవత్తరంగా సాగుతోంది. ఒకదాన్ని మించి మరొకటి మ్యాచ్​లు జరుగుతున్నాయి. భారీ స్కోర్​లు, అదిరిపోయే ఛేజింగ్​లతో క్యాష్​ రిచ్ లీగ్ ఆడియెన్స్​కు ఫుల్ మజాను పంచుతోంది. మెగా లీగ్ క్రమంగా ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే కోల్​కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్​లు ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అయిపోయాయి. మిగిలిన రెండు బెర్త్​ల కోసం ఐదు జట్ల మధ్య పోరు నడుస్తోంది. ప్లేఆఫ్స్ బెర్త్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ రెండు జట్ల మధ్య 18వ తేదీన జరిగే మ్యాచ్​లో ఎవరు నెగ్గితే వాళ్లు క్వాలిఫై అవుతారు. ఈ నేపథ్యంలో లెజెండ్ హర్భజన్ సింగ్ తన ప్రిడిక్షన్ చెప్పాడు.

ఆర్సీబీ-సీఎస్​కే పోరులో గెలుపు డుప్లెసిస్ సేనదేనని హర్భజన్ అన్నాడు. కీలక మ్యాచ్​ కాబట్టి అగ్రెషన్ చూపించడంతో పాటు కూల్​గా ఉండటం కూడా అంతే ముఖ్యమని చెప్పాడు. బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీకి, చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బిగ్ గేమ్స్​లో ఎలా ఆడాలనేది బాగా తెలుసన్నాడు భజ్జీ. వన్డే వరల్డ్ కప్-2011 నెగ్గిన భారత జట్టులో కోహ్లీ సభ్యుడని.. అతడి చేతిలో ఐపీఎల్ ట్రోఫీ లేకపోయినా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని స్పష్టం చేశాడు. ఆర్సీబీ ఇప్పటిదాకా ఒక్క కప్పు కొట్టకపోయినా బ్యాటర్​గా తాను ఏం చేయాలో అది చేస్తూ వచ్చాడని.. ప్రతిసారి టాప్ స్కోరర్స్​లో కోహ్లీ పేరు ఉండటమే దానికి సాక్ష్యమని పేర్కొన్నాడు భజ్జీ.

ధోనీని కూడా లైట్​గా తీసుకోవద్దని.. అతడు చెన్నైకి ఐదు కప్పులు అందించాడని హర్భజన్ అన్నాడు. ప్లేఆఫ్స్ లాంటి కీలక మ్యాచుల్లో సెంటిమెంట్లను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదనన్నాడు. ఇలాంటి మ్యాచుల్లో ఎవరు ప్రెజర్​ను బాగా హ్యాండిల్ చేస్తారో వాళ్లే విజేతగా నిలుస్తారని చెప్పుకొచ్చాడు. సీఎస్​కేతో మ్యాచ్​లో ఆర్సీబీ టాస్ నెగ్గితే మాత్రం ఆ టీమ్​దే గెలుపని భజ్జీ స్పష్టం చేశాడు. యంగ్ బ్యాటర్ రజత్ పాటిదార్ సూపర్ ఫామ్​లో ఉన్నాడని.. ఇతర బ్యాటర్ల మీద ఉన్న ప్రెజర్​ను అతడు తీసేస్తున్నాడని వ్యాఖ్యానించాడు. హోమ్ కండీషన్స్​లో ఆడుతుండటం బెంగళూరుకు కలిసొస్తుందన్నాడు. పత్తిరానా, ముస్తాఫిజుర్, దీపక్ చాహర్ లాంటి బడా ప్లేయర్లు లేకపోవడంతో చెన్నై కాస్త బలహీనపడిందని వివరించాడు. మరి.. భజ్జీ చెప్పినట్లు ఆర్సీబీ గెలుస్తుందా? లేదా సీఎస్​కేదే విజయమా? మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Star Sports India (@starsportsindia)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి