iDreamPost
android-app
ios-app

SRH మ్యాచ్​పై సచిన్ రియాక్షన్.. పొగుడుతూనే వారిపై విమర్శలు!

  • Published Apr 16, 2024 | 3:30 PM Updated Updated Apr 16, 2024 | 3:30 PM

సన్​రైజర్స్ హైదరాబాద్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన రికార్డ్ స్కోరింగ్ మ్యాచ్ మీద లెజెండ్ సచిన్ టెండూల్కర్ రియాక్ట్ అయ్యాడు. పొగుడుతూనే వారిపై విమర్శలు గుప్పించాడు మాస్టర్ ​బ్లాస్టర్.

సన్​రైజర్స్ హైదరాబాద్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన రికార్డ్ స్కోరింగ్ మ్యాచ్ మీద లెజెండ్ సచిన్ టెండూల్కర్ రియాక్ట్ అయ్యాడు. పొగుడుతూనే వారిపై విమర్శలు గుప్పించాడు మాస్టర్ ​బ్లాస్టర్.

  • Published Apr 16, 2024 | 3:30 PMUpdated Apr 16, 2024 | 3:30 PM
SRH మ్యాచ్​పై సచిన్ రియాక్షన్.. పొగుడుతూనే వారిపై విమర్శలు!

చిన్నస్వామి స్టేడియంలో పెను విధ్వంసం జరిగింది. సన్​రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు నువ్వానేనా? అంటూ తలపడి పరుగుల సునామీని సృష్టించాయి. బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ మ్యాచ్​లో బౌలర్లు ఏం చేయాలో తెలియక గుడ్లు తేలేశారు. బ్యాటర్ల తుఫానులో వాళ్లు మునిగిపోయారు. చరిత్రలో ఎప్పుడూ చూడని మ్యాచ్ ఇది. అవును, ఆర్సీబీ-ఎస్​ఆర్​హెచ్ మధ్య రికార్డ్ స్కోరింగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఆరెంజ్ ఆర్మీ 25 పరుగుల తేడాతో నెగ్గింది. అయితే ఓడినా ఆర్సీబీ అందరి హృదయాలు గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్​హెచ్ 20 ఓవర్లకు ఏకంగా 287 పరుగులు చేసి ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరు నమోదు చేసిన టీమ్​గా నిలిచింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన బెంగళూరు ఓవర్లన్నీ ఆడి 262 పరుగులు చేసింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ మీద లెజెండ్ సచిన్ టెండూల్కర్ రియాక్ట్ అయ్యాడు.

రికార్డ్ స్కోరింగ్ మ్యాచ్ పై సచిన్ తనదైన శైలిలో స్పందించాడు. సన్​రైజర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. ఇరు టీమ్స్​లోని ఆటగాళ్లు పవర్ హిట్టింగ్​తో అదరగొట్టారని మెచ్చుకున్నాడు. రెండు ఇన్నింగ్స్​ల్లోనూ కలిపి 40 ఓవర్లలో 549 పరుగులు వచ్చాయంటే మామూలు విషయం కాదని ప్రశంసించాడు. అయితే మెచ్చుకుంటూనే విమర్శలు గుప్పించాడు మాస్టర్​ బ్లాస్టర్. బ్యాటర్లు ఈ స్థాయిలో చెలరేగి పరుగుల వరద పారిస్తే ఎవరు మాత్రం బౌలర్ అవ్వాలని కోరుకుంటారంటూ ప్రశ్నించాడు. సచిన్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని మీద నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. బ్యాటింగ్ గ్రేట్ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని అంటున్నారు.

బ్యాట్స్​మెన్ ఇంత విధ్వంసం సృష్టిస్తే బాల్ చేతిలో పట్టుకోవాలన్నా బౌలర్లు భయపడతారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సచిన్ వ్యాఖ్యలతో వాళ్లు ఏకీభవిస్తున్నారు. ఎంత టీ20 మ్యాచ్ అయినా ఇంత ఫ్లాట్ పిచ్​లు తయారు చేయడం సరికాదని, బ్యాట్​కు బంతికి మధ్య బ్యాలెన్స్ ఉండేలా చూడాలని కోరుతున్నారు. వికెట్ నుంచి బౌలర్లకు కూడా మద్దతు లభిస్తే మ్యాచ్​లు మరింత రసవత్తరంగా సాగుతాయని, ఆ దిశగా పిచ్ క్యూరేటర్లు, బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సచిన్ చెప్పినది అక్షరాలా నిజమని.. ఇక మీదట కూడా ఇలాంటి భారీ స్కోర్లే నమోదైతే, ఫ్యూచర్​లో బౌలర్‌‌ కావాలని ఎవరూ అనుకోరని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. బౌలర్ అవ్వాలని ఎవరూ అనుకోరంటూ సచిన్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.