iDreamPost
android-app
ios-app

చరిత్ర తిరగరాసిన SRH.. IPL హిస్టరీలో మరో జట్టుకు సాధ్యం కాదేమో?

  • Published Apr 15, 2024 | 9:52 PM Updated Updated Apr 15, 2024 | 9:52 PM

సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు చరిత్రను తిరగరాసింది. ఐపీఎల్ హిస్టరీలో మరే జట్టుకూ ఇది సాధ్యం కాదేమో అనిపించే రికార్డు ఇది.

సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు చరిత్రను తిరగరాసింది. ఐపీఎల్ హిస్టరీలో మరే జట్టుకూ ఇది సాధ్యం కాదేమో అనిపించే రికార్డు ఇది.

  • Published Apr 15, 2024 | 9:52 PMUpdated Apr 15, 2024 | 9:52 PM
చరిత్ర తిరగరాసిన SRH.. IPL హిస్టరీలో మరో జట్టుకు సాధ్యం కాదేమో?

సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు విధ్వంసానికి కొత్త డెఫినిషన్ ఇచ్చింది. ఈ టోర్నీ ఆరంభం నుంచి అదరగొడుతున్న ఎస్​ఆర్​హెచ్.. మరోమారు తమ బ్యాటింగ్ పవర్ చూపించింది. ఆర్సీబీతో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ ఓవర్లన్నీ ఆడి 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది సన్​రైజర్స్. ఇదే సీజన్​లో ముంబై ఇండియన్స్​ మీద 277 పరుగులతో ఉన్న తన ఆల్​టైమ్ రికార్డును తాజా మ్యాచ్​తో తుడిచేసింది కమిన్స్ సేన.

ఆర్సీబీతో మ్యాచ్​లో ఇంకొన్ని రికార్డులు క్రియేట్ చేసింది ఎస్​ఆర్​హెచ్. ఒకే సీజన్​లో 250 ప్లస్ స్కోర్లు రెండుసార్లు చేసిన టీమ్​గానూ అరుదైన ఘనత సాధించింది. అలాగే టీ20 క్రికెట్ హిస్టరీలో 270 ప్లస్ స్కోర్లను రెండుసార్లు నమోదు చేసిన ఏకైక జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్​లో సన్​రైజర్స్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (41 బంతుల్లో 102) సెంచరీతో విరుచుకుపడ్డాడు. క్లాసెన్ (31 బంతుల్లో 67) కూడా ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. ఆఖర్లో మార్క్రమ్ (32 నాటౌట్), అబ్దుల్ సమద్ (37 నాటౌట్) కూడా తమ బ్యాట్లకు పని చేయడంతో హయ్యెస్ట్ స్కోర్ రికార్డు బ్రేక్ అయింది.