Nidhan
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ అరుదైన ఘనత సాధించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వల్ల కూడా కానిది.. అతడు సాధించి చూపించాడు.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ అరుదైన ఘనత సాధించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వల్ల కూడా కానిది.. అతడు సాధించి చూపించాడు.
Nidhan
ఐపీఎల్-2024ను గెలుపుతో ఆరంభించిన పంజాబ్ కింగ్స్ రెండో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు మరో 4 బంతులు ఉండగానే ఆ స్కోరును ఛేజ్ చేసేసింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఒక దశలో ధావన్ సేన ఈజీగా నెగ్గుతుందని అనిపించింది. కానీ విరాట్ కోహ్లీ (77), దినేష్ కార్తీక్ (28 నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. అయితే ఈ మ్యాచ్ ద్వారా ధావన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కానిది అతడు చేసి చూపించాడు.
ఐపీఎల్లో ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్లలో ఒకడిగా ధావన్‌ను చెప్పొచ్చు. స్టార్టింగ్ సీజన్ నుంచి ఇప్పటిదాకా క్యాష్ రిచ్ లీగ్‌లో కంటిన్యూ అవుతున్న వారిలో ధావన్ ఒకడు. ఇప్పటి వరకు 200కు పైగా మ్యాచులు ఆడిన ఈ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ 6 వేలకు పైగా పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలతో పాటు ఏకంగా 50 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మెగా లీగ్‌లో తాజాగా మరో రికార్డును తన పేరు మీద రాసుకున్నాడు గబ్బర్. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఎవరికీ సాధ్యం కాని ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బౌండరీతో ఐపీఎల్ హిస్టరీలో 900 ఫోర్లు కొట్టిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఫోర్ల విషయంలో లీగ్‌లో ధావన్ తర్వాతి స్థానాల్లో స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (878), డేవిడ్ వార్నర్ (877) ఉన్నారు.
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (811) బౌండరీల విషయంలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో 5 ఫోర్లు బాదిన ధావన్ ఐపీఎల్ బౌండరీల సంఖ్య 902కు చేరింది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 37 బాల్స్‌ను ఫేస్ చేసిన గబ్బర్ 45 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అతడు రాణించినా మరో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (8) ఫెయిలయ్యాడు. ప్రభుసిమ్రన్ సింగ్ (25), లివింగ్స్టన్ (17), సామ్ కర్రన్ (23), జితేష్ శర్మ (27).. ఇలా మిగిలిన బ్యాటర్లు కూడా మంచి స్టార్స్ అందుకున్నా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. దీంతో హ్యూజ్ టార్గెట్‌ను పంజాబ్ సెట్ చేయలేకపోయింది. ఒకవేళ 200కి పైగా రన్స్ చేసుంటే మాత్రం ఆర్సీబీ నెగ్గడం అసాధ్యంగా మారేది. మరి.. ఇన్నేళ్ల ఐపీఎల్లో ఎవరికీ సాధ్యం కానిది ధావన్ సాధించడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: RCBలో బ్లాక్ షీప్! మ్యాచ్ గెలిచినా ఆ ప్లేయర్‌ని తీసేయమంటూ ఫ్యాన్స్ రచ్చ!
Shikhar Dhawan became the first batter in the history of IPL to smash 900 boundaries.
– Gabbar, one of the greatest! 👏 pic.twitter.com/MFD8XlvVQV
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2024